Tuesday 1 January 2013



02-01-2013

Prapancha Telugu Mahaa Sabhalu -2


సభలకు వాసి లేని రాశి జనం.. 
ప్రముఖ పత్రికలకు, వైతాళికులకు అవమానం.
_______________________________________________________
ప్రపంచ తెలుగు మహా సభలకు జనం తండోపతండాలుగా తరలివచ్చారని సంబరపడ్డారు. నిజమే.కానీ ఆ వచ్చిన వారి వయసేమిటి. చిత్తూరు జిల్లాలొ విద్యా సంస్ఠలకు మూడురోజులు సెలవులు ప్రకటించడంతో  ఉపాధ్యాయులపై ఒత్తిడి చేసి సభలు రెండు, మూడు దినాల్లో స్కూలు పిల్లలను  తరలించారు. సాహితీ, చర్చా వేదికల్లొ కిక్కిరిసి పిల్లలు కూర్చున్నారు కాని వారికి ఒక్క ముక్క అర్ధం కాలేదు. మూడో  రోజు కుంభ వృష్టి కి తలదాచుకునే చోటు కరవై పిల్లలు తడిసి  ముద్దయ్యారు. మధ్యాహ్నం వారు తిండి లేక అల్లాడారు. నిర్వాహకులు కనీసం పిల్లలకైనా భోజన సదుపాయం కల్పించ లేకపోయారు. ప్రాంగణం రద్దెగా ఉనా అదొక రైల్వే ప్లాట్ ఫారం లా, ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ మాదిరి రామంధాళిగా మారింది. సంగీత, సాంస్కృతిక వేదికల్లో కార్యక్రమాలు కొంత ఆసక్తి రేకెత్తించినా,ప్రముఖ నాట్యకారులు  రాధరెడ్డి, రాజారెడ్డి ప్రదర్శనలు రద్దయి వీక్షకులు నీరస పడ్డారు. అదేమాదిరి యామినీ కృష్ణమూర్తి నాట్యం ప్రదర్శన నోచుకోలేదు. బాలికలు భరత నాట్యం, కూచిపూడి ప్రదర్శిస్తున్న సమయంలొ వారిని అర్ధంతరంగా నిలిపివేయడంతో పిల్లలు కన్నీళ్ళ పర్యంత మయ్యారు.రంగస్ఠల వేదికల్లో హడావిడి కనిపించినా ప్రదర్శకులకు నిర్వాహకులు ఖర్చుల సొమ్ము  చెల్లించక పోవడంతో దిక్కుతొచక పెదవి విప్పి ఎవరినీ అడగలేక బావురుమన్నారు.  సభ ప్రారంభ సందర్భంలోనే హంసపాదు పడింది. జ్వరం, గాత్రలోపంతో  జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సి నారాయణరెడ్డి విరచిత ఇతివృత్త  గీతాన్ని ఎస్ పి బాలు ఆలపించలేక రికార్డు  వినిపించారు. పురస్కారలు అందుకొవలసిన వారిలొ సినారె అనారోగ్య కారణాలు చూపి గైరుహాజరయ్యారు. పొట్టి శ్రీరాములు  విశ్వవిద్యాలయ ఉపకులపతి శివారెడ్డి, ప్రముఖ కవి డా.ఎన్ గోపిస్ఠానిక శాసన సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అలకబూని ప్రాంగణంలో మటుమాయమయ్యారు. సినీసంగీత విభావరికి  ప్రముఖులు రాకపోవడంతో  వెలవెల బోయింది. అదే మాదిరి "తారలు దిగివచ్చిన వేళ" కార్యక్రమానికి ఒకరిద్దరు పాత తరం వారు మొక్కుబడిగా హాజరవ్వడంతో వేదిక కళాహీనంగా తయారయ్యింధి. ఉత్సాహం లేదు. ఉద్వేగం అసలే లేదు. ప్రముఖ మృదంగ విద్వాంసుడు డా.ఎల్లా వెంకటేశ్వర రావు కచ్చరి సమయం కుదించారు. సభలు ముగింపురోజు సాయంత్రం ఉండవలసిన డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ అర్ధంతరంగా మధ్యాహ్నానికి ముందుకు జరగడంతో ఎంతో ఆశగా సాయంత్రం వచ్చిన శ్రోతలు నిరాశ చెందారు. అలాగే డా.శోభారాజు కూడా భక్తి సంగీత కార్యక్రమానికి  రాలేదు. ప్రముఖులున్నా పద్యకవి సమ్మేళనం రక్తి కట్టించలేక పోయింది. ధ్వన్యనుకరణ  సమ్రాట్ నేరెళ్ళ వేణూ మాధవ్ మిమిక్రీ గాత్రలోపం వలన, మైక్ సాంకేతిక లోటువల్ల నిరాశమిగిల్చింధి. ఒకటో రోజు, రెండో రోజు చర్చావేదికల్లో కొంత రసవత్తర చర్చ జరిగినా శ్రోతలు కరవయ్యారు. విదేశాలు, లండన్లో తెలుగు బోధన,విదేశాల్లో తెలుగు రేడియో... కార్యక్రమాలకు ప్రజాదరణ లభ్యంకాలేదు. అధికార భాషా సదస్సు చర్చావేదిక ఒక్కటే అర్ధవంతంగా సాగింధి. కానీ జనం నిందుకున్నారు. చర్చలు నీరసంగా జరిగాయి. బోధనాభాషగా తెలుగుతెలుగు భాష ప్రస్తుత సమస్యలు, సాహిత్య భాష చర్చలు చప్పగా జరిగాయి. శ్రోతల సంఖ్య వేళ్ళమీద లెక్కించవచ్చు.ఇక పత్రికారంగంలొ తెలుగు చర్చ అంథా పేలవంగా ఏక వ్యక్తి ప్రదర్శనగా సాగింది. ఆరుగురు సీనియర్ పాత్రికేయులు పాల్గొనవలసిన చర్చలొ కేవలం ఆంధ్రభూమి  సంపాదకుదు ఎం వి ఆర్ శాస్త్రి మాత్రమే హాజరయ్యారు. కేవలం ఆయనను సన్మానానించేందుకే కార్యక్రమం పెట్టారా అనిపించింది.హెచెం టివి ఎడిటర్ కె రామచంద్రమూర్తి, మహా టివి ఎడిటర్ ఐ వెంకట్రావు, హాన్స్ సహాయక ఎడిటర్ టంకసాల అశోక్, పిరాట్ల వెంకటెశ్వర్లు,నాగనూరి వేణుగోపాల్,సి హెచ్ రాజగోపాల్, తదితరులెవరూ తెలుగు సభల వైపు కనీసం తొంగిచూడలేదు. తెలుగు ప్రస్తుత సమస్యలు చర్చలొ కేవలం జి ఎస్ వరదాచారి, గుడిపూడి శ్రీహరి మాత్రమే మొక్కుబడిగా కనిపించారు. ఇక్కడే ఒక ముఖ్య విషయం ప్రస్తావించుకోవాలి.  ప్రపంచ తెలుగు మహాసభలలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్లో ప్రముఖ పత్రికలకు ఉరి వేశారు. వైతాళికులను  చీకట్లోకి నెట్టి మిడిమిడి జ్ఞానపు సంపాదకులను అందలం ఎక్కించారు. తెలుగు నేలపై పరిఢవిల్లిన మహనీయ పాత్రికేయులు కందుకూరి వీరేశలింగం,కాశీనాధుని నాగేశ్వరరావు, న్యాపతి సుబ్బారావు, ఎం చలపతిరావు, కోటంరాజు రామారావు, చింతామణి, నీలంరాజు  వెంకటశేషయ్య, పండితారాధ్యుల నాగేశ్వరరావు, విద్వాన్ విశ్వం, సురవరం ప్రతాపరెడ్డి, గోరాశాస్త్రి ఆదిగాగల వారి చిత్రాలకు చోటులేకపొయింది. పోలీసు స్టేషన్లలో,రైల్వే ప్లాట్ ఫారం లమీద, బస్ స్టాండ్లలో కేద్దెల ఫోటోలను ఉంచినత్లు కేవలం నాలుగు,ఐదేళ్ళుగా రంగంలొ మిడిమేలపు వెలుగుల సంపాదకులను ఏర్చి కూర్చి గోడకెక్కించారు. కీర్తిశేషుల మధ్య బతికున్న వారికి స్థానం ఇచ్చారు. పోలీసు కేసులున్న జర్నలిస్టులుకూడా వారిలో వుండడం విశేషం.            

1 comment:

  1. చాలా బాగా వివరించారు రాధాకృష్ణగారూ! బాపు, అక్కినేని లాంటి ప్రముఖులను వేదిక పై ఆశీనులను చేసి వారి గురించి కొన్ని మాటలు
    చెబితే బాగుండేది. కనీసం శాలువాలైనా సరిగ్గాకప్పలేదు. మడతలు భుజాన మొక్కుబడిగా పడేశారు. ఇంతకంటే మా కార్టూన్ ఫెస్టివల్
    హైద్రాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో చక్కగా నిర్వహించారు.

    ReplyDelete