Thursday 21 February 2013


                                                           అచ్చంగా తెలుగుకు ఏడాది పూర్తయింది 






బుడి బుడి నడకలతో మొదలై వడి వడి అడుగులతో ఉరకలేస్తున్న "అచ్చంగా తెలుగు" బృందానికి ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. .. 

చెల్లెలు చి.ల.సౌ. భావరాజు పద్మినికి ఆశీస్సులు, అభినందనలు, మంగళహారతులు, విజయ దుందుభులు..

కమ్మనైన అమ్మ భాష పట్ల మక్కువతో మరింత ఆసక్తి పెంచుకుని, ఆ మాతృభాష పరిమళాలను తెలుగు నేల నలుదిశల వ్యాపింపజేసే సదాశయంతో సరిగ్గా ఏడాదికిందట,తెలుగు వారికి ప్రతిష్ఠాత్మకమైన పర్వదినం వంటి ఇదే మాతృభాషా దినాన 2012 ఫిబ్రవరి 21న ప్రారంభించిన అచ్చంగా తెలుగు బృందం నేటితో ఏడాది పూర్తిచేసుకుని రెండో సంవత్సరంలో అడుగెట్టింది. ఈ బృందం ఇప్పుడు 608 మంది సభ్యులతో అలరారుతున్నది. 

ఏడాదిలో అచ్చంగా తెలుగు ఎలా ఎదిగిందంటే ఆ నాడు బలిచక్రవర్తి నుంచి దానంగా పొందిన మూడడుగులకోసం విశ్వమంతా వ్యాపించిన వామనుని వలే... పద్మిని అకుంఠిత దీక్ష, ఉత్సాహం ఇనుమడించినందునే ఏడాదిలో ..ఆనాడు వామనుని మూర్తి మాదిరి......అచ్చంగా తెలుగు "బ్రహ్మాండాంతసంవర్ధియై.." ఎదిగిగి పెద్దల మన్ననలు పొందింది.

మరోసారి చెల్లెలుకు అభినందనలు. ఆమెకు సహకరిస్తున్న సభ్యులకు హృదయపూర్వక అభివాదములు.. ఆమెకు వెన్నుదన్నుగా నిలిచి అండందలందిస్తున్న "తెలుగు బావగారు: సతీష్ గారికి కృతజ్ఞ్తలు. అశీస్సులందిస్తున్న గురువర్యులకు, ప్రొత్సహిస్తున్న పెద్దలకు ప్రణామములు.,

ఈ సందర్భంగా.. పోతనామాత్యుని ఘంటమునుంచి జాలువారిన ఆ మృదుమధురమైన అచ్చ తెలుగు పద్యం ఇక్కడ పునః పఠించుకోవడం మాతృభాషను గౌరవించుకున్నట్లే అవుతుంది..

ఇంతింతై, వటుడింతై, మఱియు దానింతై, నభోవీధిపై
నంతై, తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపై నంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై...

అలా పెరుగుతున్న మన తెలుగుకు వచ్చిన ప్రమాదమేమీలేదు.. మనకంతా ప్రమోదమే..

1 comment:

  1. నమస్కారం పద్మిని గారూ రాధాకృష్ణగారూ.

    ముందుగా మీ అచ్చంగా తెలుగు మాధ్యమం బృందానికి నా శుభాకాంక్షలు.

    నేనూ యిందులో ప్రచురితమవుతున్న కవితలు వ్యాసాలు చదువుతుంటాను. ఆనందిస్తూవుంటాను. ఒక కార్యక్రమ మొదలు పెట్టి దాని ప్రధమ వార్షికోత్సవం జరుపుకునే ఆనందం వర్ణనాతీతం. దాని వెనుక శ్రమ ఆ ఆనందం తో సమసిపోతుంంది.

    ఏదో చదువుకుని ఆనందించడం తప్ప మీ స్తాయి కి తగ్గ్గ వాడిని కాదు. రాయడం లో ఏదైనా తప్పుగా వుంటే క్షమతవ్యుడిని.

    ReplyDelete