Saturday 31 August 2013

ఇది రోజువారీ రాజకీయం.. 

వారంలో...  వార్తలు-విశేషాలపై వ్యాఖ్యలు.. 




30-8-13
*Having seen the painful postings of Bhandaru Srinivasa Rao and Jwala Narasimha Rao, I once again appeal/request to all my learned friends, particularly the veteran( not by age/seniority but by maturity ) journalists not to accept the invitations by Telugu electronic channels and participate in the debates/ political analysis /news scan programs. The most unscrupulous, immature, and zero knowledge fellows are running the programs. That is why I called the self declared analysts( who are being patronised by channels) "VAARAALABBAYILU". The learned friends may scribble their thoughts/opinions in the columns of Telugu/English newspapers, which last long. It will prove the mettle of the person too. In the name of debates the channels are promoting verbal duo freestyle wrestling.

28-8-13
*అధికార పక్షం, విపక్షం, ప్రత్యేక వాదులు, సమైక్య వాదులు, ఉద్యోగనేతలు, ఉద్యమకారులు, విశ్లేషకులు, పాత్రికేయులు, న్యాయవాదులు.. వెరసి మేధావులారా(సామాన్య ప్రజలు ఈ కోవలోకి రారు)..రాష్ట్ర విభజనపై ఒకసారి కేంద్రం కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తరువాత, యు పి ఎ అధినేత్రి, ప్రధాని, గృహ మంత్రి అది వెనుకకు పోని నిర్ణయమని కుండబద్దలు కొట్టి చెప్పినా ఎందుకీ నాటకాలు, ఉద్యమాలు, ధర్నాలు, డిల్లీ ప్రయాణాలు, మంతనాలు, దీక్షలు? ఇంకెన్నాళ్ళు ప్రజలను మోసగించి పబ్బం గడుపుకుంటారు? కాంగ్రెస్ కేంద్ర మంత్రులు, ఎంపీలు, సమైక్య మంత్రులు,  ప్రజా ప్రతినిధులారా! ఇకనైనా రాష్ట్రాన్ని దగ్ధం చెయ్యకండి. ఇష్టం లేకుంటే పార్టీని, పదవులను వీడి, అన్ని ప్రభుత్వ సదుపాయాలు నిరాకరించి మీరూ జనంలో మమేకం కండి, లేకుంటే ఇళ్లలో కూర్చోండి. . మీరు చేస్తున్న ఆమరణ  దీక్షలు ప్రజల ప్రాణాలు తీస్తున్నయి. మీలో ఒక్కరూ మరణించలేదు.  నాయకులు దీక్షకు ఉపక్రమించడం జనం ఉద్రేక పడిపోవడం.. బతిమిలాడించుకునో, భంగపడో మీ దీక్షలు అటకెక్కించుకోవడం రివాజైంది. ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుల మౌనం ఎన్నాళ్ళు? వాళ్లకు లబ్దిచేకూరే వరకు ఇంతే. తరువాత తట్ట తగలేసి పోతారు.

27-8-13
*రాష్ట్ర వివాద రావణకాష్ఠం చల్లారకుండానే ఐ టివి తెలుగు న్యూస్ చానల్ కొత్తగా జిల్లాల చిచ్చుపెట్టింది. 1956 తరౌవాత రాష్త్రంలో 3 జిల్లాలు మాత్రమే ఏర్పడ్దాయట. ఒక ఎంపీ 13 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంటే కలెక్తరు 39 లక్షలమందికి ప్రాతినిధ్యం వహిస్తున్నారంటూ. నిప్పు రాజుకుని ఇక జిల్లాలకు అంటుకుంటుంది. అనతపురం జిల్లాకంటే 39 దేశాలు విస్తీర్ణంలో తక్కువట. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా వైశాల్యం 11 వేల చదరపు కిలోమీటర్లైతే కొన్ని జిల్లాల వైశాల్యం 39 వేల కిలోమీటర్లట.. రాష్ట్రంలో నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ ఎప్పటినుంచో ఉందని కథనం కూడా..ఇది ఇప్పుడవసరమా.. నియంత్రణలేదా? అందునా ఆన్యూస్ చానల్ స్వయానా ముఖ్యమంత్రిదని విస్తృత ప్రచారంలో ఉంది కూడా.. ఇక రేపటినుంచి కొత్త కోణంలో మహా విశ్లేషకులు విజృంభిస్తారు కామోల్సు.
*బహుశః మన రాష్ట్రంలోనే అనుకుంటా ఈ వైపరీత్యం, ఇంత అరాచకత్వం. . 28 రోజులుగా మహోధృతంగా ఉద్యమం నడుస్తుంటే చీమకుట్టినట్లుగా లేని రాష్ట్ర ప్రభుత్వం. అంతకు మించి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగాసమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వోద్యోగ నాయకులతో ఒక దేశ ప్రధాని భేటీ! గతంలో తెలంగాణ ఎన్‌జీఓలు, ఇప్పుడు సీమాంధ్ర ఎన్‌జీఓలు.. 25 రోజులుగా రవాణా సౌకర్యం లేకుండా ఆర్టీసి ఉద్యోగులు సమ్మె చేస్తూ ప్రజలను యమయాతనలు పెడుతుంటే కొరడా ఝళిపించని ప్రభుత్వం. సమ్మె నెందుకు నిషేదించదు ప్రభుత్వం..సాక్షాత్తు సచివాలయంలో, ట్రాన్స్కొ, జెంకో , అరణ్య సదన్ కార్యాలయాల్లో వారం పైగా ఘర్షణ వాతావరణం. నెలరోజులుగా బళ్ళు మూత..విద్యార్థుల భవిత ప్రశ్నార్ధకం.. పెదవి విప్పని ప్రభుత. రాజధానికూడా వేదెక్కుతున్నది, ఎప్పుడు అంటుకుంటుందో!! ఎక్కడ చూసినా లక్ష గళాచర్చనలు.. డెల్లీలో, హైదరాబాద్ లోనే ప్రభుత్వాల గొంతులు పెగలడం లేదు.. గొంతుల్లో పచ్చి వెలక్కాయ పడింది..

26-8-13
*పదవుల కోసం కాదు ప్రజా సేవకే అంకితం..
ప్రాణాలు పోయినా లెక్కజేయం.. ప్రజా సంక్షేమమే పరమావధి..
సమైక్యం కోసం ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడం..
ఈ డైలాగులు విని పిచ్చిజనం రోడ్లెక్కుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల భార్యలు, మాజీలు, తాజాలు అందరూ దీక్షా దక్షులే.
ఐతే అందరి ఆమరణం మూడురోజుల ముచ్చటే.. కూర్చున్న గంటకే నీరసం, బిపి డౌన్, సుగర్ లెవెల్ హై, గిడ్డినెస్.. రెండ్రోజుల్లో ఎన్నెన్ని (గుప్త) రోగాలు బయటకోస్తాయో! డాక్టర్ల సలహాలు, కుటుంబ సభ్యుల సూచనలు, పార్టీ నేతలు.. కొన్ని సందర్భాల్లో మంత్రులు, ముఖ్య మంత్రులు, కేంద్ర నాయకత్వం బతిమాలుళ్ళు...అప్పటికే చానళ్ళలో కావలసినంత పబ్లిసిటీ, మంచి మైలేజీ, పత్రికల్లో ఫొటొలు..కేంద్రం దృష్టికి సమస్యను తీసుకెళ్ళినందున, సానుకూలంగా పరిష్కరించేదుకు సుముఖత వ్యక్తం చేసి హామీ ఇచ్చినందున,విశ్వాసం వ్యక్తం చేస్తూ వెంటనే దీక్ష విరమణ.. ఉద్యమమా జోహార్.. చరిత్ర పునరావృతమవుతుంది.. అది ఒక్క సమైక్యానికే పరిమితం కాదు. ప్రత్యేకమైనా, ఇళ్ళయినా, నీళ్ళైనా, స్థలాలైనా, స్కాలర్‌షిప్ లైనా, కరెంటు-ఆర్టీసీ చార్జీలైనా, అఘాయిత్యాలైనా, అత్యాచారాలైనా... విత్తనాలు-ఎరువులైనా, ఎన్‌కౌంటర్లైనా, పెట్రోలు, దీజిలు, గాసు, చివరకు ఉల్లిపాయలైనా .... పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రం..ఓ పెద్ద కుతంత్రం.. దీక్షా కంకణం..
*ఉల్లి ఘాటు, జగన్ పోటు ప్రభుత్వానికి చేటు..

24-8-13
*ఎన్‌టి రామారావు, చంద్రబాబు నాయుడు, రాజశేఖరరెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, విజయశాంతి, చిరంజీవి, తాజాగా జగన్మోహనరెడ్డికి బ్రహ్మరథం పట్టి, విశ్వాసం ప్రకటించి వారి పార్టీలకు, కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలకు చెక్క భజన చేసిన ప్రవాసాంధ్రులు నెల రోజులుగా నోరు విప్పడంలేదే? రాష్ట్రం తగలడుతుంటే, తెలుగు తల్లి భోరుమంటుంటే, డాలర్ల సంపాదనలో పడి కన్న నేలను మరచిపోయారా? 'తానా,ఆటా..' లు కనబడడం, వినబడడం లేదే! ఎందుకీ మౌనం? మనవారిదెంత భాషాభిమానం, రాష్ట్ర ప్రేమ, దేశ భక్తి.. ఎవరెటు, చెప్పండి.
*"శ్యామలా దండకం" ధ్యానిస్తే రాహు గ్రహ పీడన విముక్తికలుగుతుంది--- ఒక ఆధ్యాత్మిక ప్రగాఢ విశ్వాసం.
   మరి రాహుల్ గ్రహవిముక్తికి దండకంకం పఠించాలి? -- మరొక అవకాశవాద అనుమానం..
**ఇదివరలో (గుంటూరు జిల్లాలో) "అమృతరావ్"అని, ఒక ఆమరణ నిరాహారదీక్షల ఫేం, హక్కుదారు(పేటెంట్) ఉండేవాడు.. పాపం పాతిక సార్లు పైగా చేసి ఉంటాడు.. నలభై   ఏళ్ళనాటి మాట. ఇప్పటి నాయకులకే కాదు.. మీడియా కింగులకు కూడా తెలీదు. ఆ రికార్డు బద్దలు చేస్తారా ఎవరైనా? ఏమో!!
*అబద్ధమే ఉద్యమాలకు ఆక్సిజన్ ... మన తెలుగు(తెగులు) మీడియా మధ్య మధ్య లో ట్యూబ్ లాగేస్తుంటుంది..
*మీరెన్నయినా చెప్పండి, ఈ"హిరణ్య గర్భం" చీల్చేది ఎప్పుడూ ఆ పై(డిల్లీ) గాంధే(ధారే)యులే.
*బాబు "హస్త" రేఖలు డిల్లీలో గీస్తారు. ఇప్పుడేమో 'చెయ్యి' కాలిపోయింది. చక్రం ఆగిపోయింది..
* ఆంధ్రజ్యోతి ఆది నుంచి అందరి సేవలలోనే తరిస్తున్నది..ఇది నిజం..

23-8-13
*నట్టనడుమ నడి వీపున పుట్టిన రాచపుండు మిడిమేలపు, నడమంత్రపు మీడియా.. ఈ మీడియా గతంలో వాజ్‌పేయీని, పి వి ని కూడా ఏమిచేయలేక పోయింది. మోడీ విషయంలోనూ మీడియా అంతే..ఒకటి కాదు, రెండు కాదు, మూడు సార్లు చేతులు, కాళ్ళు ఎత్తి వెల్లకిలా పడ్దది. అలాగే చిరంజీవినీ గెలిపించలేకపోయింది.. జనం వచ్చినంత మాత్రాన ఓట్లురావని, మీడియా ఎత్తినంతమాత్రాన గెలవదని కూడా చరిత్ర చెబుతోంది. అచ్చు పత్రికలు, పిచ్చ బొమ్మల డబ్బాల్లో బిస్కత్తుల వెనుక తోకలు ఊగుతుంటాయి. బాకాలు ఊదినంతమాత్రాన ఏదీ ఆకాశం నుంచి ఊడిపడదు. కొత్తది అతుక్కోదు. కొన్ని పచ్చ మీడియాలైతే, మరికొన్ని అచ్చోసిన మీడియాలు. ఒకరింట్లో తిని వేరొకరింట్లో చెయ్యికడుక్కొవడానికి అలవాటు పడింది.. వృత్తి పోయి ఉద్యోగమై చివరికి ఊడిగమయింది. పాత్రికేయం బహుకృత వేషం. అందరూ శ్రీవైష్ణవులే.. బుట్ట మొత్తం మటుమాయం..ఏ మీడియా మడిబట్ట కట్టుకోలేదు..
*ఇటలీ అమ్మ ఆశలన్నీ అడియాసలేనన్న మాట.. అమూల్ బేబీకి పెళ్ళోక్కటే కాదనుకున్నారు.. ఇప్పుడు పదవి కూడా రాదని తేలిపోయింది..ఇక ఆమె పెట్టె బేడా సర్దుకోవచ్చు..కాంగ్రెస్‌కు అమృతభాండం లాంటి ఆంధ్రప్రదేశ్ చిలికి, ఒలికి పోయింది. అమ్మ నాయకత్వం మసకబారింది. పార్లమెంటులోనే కళ్ల ఎదుటే ఏమి ధిక్కారం .. ఎంత ధైర్యం..ఇప్పుడేమిటి చెప్మా??
*తెల్లదొరల తుపాకి గుళ్ళకు నేలకొరింగిన విప్లవజ్యోతి ఒక తెలుగు వాడు..అల్లూరి
అవే తుపాకి గుళ్ళకు గుండెలెదురొడ్డి బ్రిటిషు వారి గుండెలదరగొట్టిన మరో తెలుగు సింహం... టంగుటూరి..
బానిసల మాదిరి భజనలు చేయని ధీరోదాత్తులు వారు..
అదీ తెలుతేజమంటే.. పౌరుషమంటే..ఆత్మగౌరవమంటే..

No comments:

Post a Comment