Wednesday 4 September 2013


ఉపాధ్యాయ దినం - గురుశిష్య బంధం..
------------------------------------

మన పుణ్యభూమిలో గురువుకు అగ్ర తాంబూలం.
మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ..అని అన్నారు.


                                                                 

                                                            
                                                                     గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, 
                                                       గురుర్దేవో మహేశ్వర, 
                                                       గురుస్సాక్షాత్ పరబ్రహ్మ 
                                                       తస్మై శ్రీ గురవేనమః. 

గురువు, ఆచార్యుడు, ఉపాధ్య్తాయుడు.. వీరికి వాస్తవానికి చాలా వ్యత్యాసముంది. గురు పూర్ణిమ వేరు- ఉపాధ్యాయ దినం వేరు. భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయుని నుంచి ఆచార్యుని వరకు ఎదిగిన మహోన్నతుడు. అందుకే సెప్టెంబరు 5 వ తేదీని మనం ఉపాధ్యాయ దినంగా జరుపుకుంటాం. గతంలో దానికి ఒక గొప్పతనం ఉండేది. కానీ...ఇప్పుడు దృశ్యం మారింది. తల్లకిందులయింది. 

ఒకానొకప్పుడు గురువు శిష్యులు ఒకరికోసం ఒకరు తపించేవారు. ఇది కలికాలం కదూ.... ఈ తరం గురువులు కూడ కలి బారిన పడ్డారు. కాసులు, కోరికలూ వదలటం లేదు. ఎంత దండుకుందామా అని మాత్రం చూస్తున్నారు. ఎంతిచ్చినా తీరటం లేదు. చేతి దురద.... ఎంతసేపూ తన స్వార్ధం చూడటమే కానీ ఇచ్చిన కాసుకి తగినంత విద్య చెప్పామా అన్న కనీస, ఆ చిన్న ఆలోచన, కూడా చేయటం లేదు. ఎంతసేపూ శిష్యులని హింసించడమే కాని మూడు వేళ్ళు తమను చూపుతున్నాయన్న కనీస యొచనకూదా లేకుండాపొయింది. గురువు తెలిసే చేస్తుంటే శిష్యులు నిస్సహాయంగా ఎవరిదారి వారు వెతుక్కుంటూ వెడుతున్నారు. తానుగా గురువు ఇది నువ్వు చెయ్యి, అని అంటారేమోనని నిజమైన శిష్యులు ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకు ఈ గురువులు అనటం లేదు? అనలేకపోతున్నారు?

గురువుని మించిన శిష్యులు అంటే పాత తరం గురువులు పొంగిపోయేవారు. ఈ తరంలో అటువంటి వారు ఎక్కడా కనిపించటం లేదు. ఎవరు ఎక్కువ సొమ్ము ముట్టజెబితే వారికే విద్యను విక్రయిస్తున్నారు. కాసు కున్న విలువ విద్యకి లేదు. సమాయానికంతకన్నా లేదు. పడిగాపులు గాచినా విద్య మాత్రం దక్కదు. చివరికి కాసులూ పోయి, సమయమూ వృధాఅయి, విద్యలేకుండా, సమాజంలో సంపాదించుకున్న ఆ కాస్త మర్యాదా పోయి, పరపతి పోయి, ఒట్టి చేతులతో, అవమాన భారం నెత్తినేసుకుని, చక్కాపోవటమే శిష్యులకు మిగులుతున్నది.

జ్ఞాన సంపద ఒకచోట, కాసుకోసం మరోచోట పనిచేసి అలిసి సొలసి పోవటం ఇప్పటి గురువు వ్యవహారం. రాజకీయ వాతావరణం మారక పోవటం నిప్పుకు గాలి తోడైనట్లయింది. అందుకే ఏ రంగంలోనూ విద్యార్హతలు, జ్ఞాన సంపద కలవాళ్ళూ కరువయ్యారు. అంతటా, కాసుల గలగలలు, రాజకీయత. లోపాయికారీ తనంతో విద్య సంపాదించిన శిష్యుల రెపరెపలు తప్ప, జ్ఞాన సముపార్జన కనుమరుగవుతున్నది.








No comments:

Post a Comment