Friday 20 September 2013

**వారాంతం వేడి వేడి పకోడీలు...



*ఏడాది నలిగిన తరువాత పెళ్ళి చూపులు. తరువాత ఏడాదికి నిశ్చయ తాంబూలం.. మరో ఏడాది గదిచిన పిమ్మట ముహూర్త సమాలోచన.. ఇంకో ఏడాదికి ముహూర్తం..రెండేళ్ళ తరువాత పెళ్ళి, ఆ తరువాత ఏడాదికి కాపురం. అయినా అప్పటికీ మూడు నిద్రల ముచ్చట తీరలేదు.
తాళి లేని, బాజాలు మోగని, పురోహితుడు రాని పెళ్ళి..ఇక ఆపెళ్ళిలో త్రిల్ ఏముంటుండి? అసలు పెళ్ళయినట్లా లేదా? జవాబులేని ప్రశ్న..
తెలంగాణా ప్రకటన అయినా, జర్నలిస్టుల అవార్డుల బహుకరణ అయినా అంతే.. ఎండమావులే!!!
*Supreme court issuing notices to Ministers, CBI naming ministers as accused, Additional DGP involved in forgery, arrest of a scribe for his alleged partnership in the crime, MPs, ministers lodged in prison, and few forced to resign on charges of corruption, CM dropping colleagues from cabinet, MPs, MLAs, MLCs and even members of the cabinet charging CM with gross failures in many fields, IAS bosses facing trials, CBI investigating into disproportionate assets of a DGP, and State turning to fireball for last 50 days..... What a great and record achievement ? AP stands in forefront.. hats off to leadership.

*వార్తలను వండి, వార్చి, వడ్డించేది మనమేగా..ఎవరి అజెండా వారిది. ఎవరి భజన వారిది. పిండికోద్ది రోట్టె.. ముట్టిన వాడికి ముట్టినంత మహదేవా!! ప్రధాని ఇంట్లో జరిగింది, సోనియా దొడ్లో జరిగింది, చంచల్‌గూడ జైల్లో జరిగింది, మోడీ ముంగిట్లో జరిగింది.. అంటూ రోజూ ఎన్నెన్ని కథలు, కథనాలు, కాకరకాయలు.... చూస్తున్నాం వింటున్నాం, చదూతున్నాం..

*మనకు తెలిసినదంతా చరిత్రకాబోదు. అదేమాదిరి తెలియనంత మాత్రాన చరిత్ర కాకుండాపోదు. మన చరిత్రను తెల్లవాడు ఎప్పుడో వక్రీకరించి తిరగా బోర్లా రాశాడు. నల్లవాడు సమర్ధించుకున్నాడు. రాజకీయమైనా అంతే. మనకు నచ్చిందే వేదం కాదు. వ్యతిరేకించినంతమాత్రాన సత్యం కాకుండాపోదు..

*మోడీతొ ఢీనా? మాడు పగులుతుంది.. మూడుసార్లు మీడియాకే సాధ్యం కాలే ఆ స్పీడు కు బ్రేకెయ్యడం..

*భజన చేసే విధము తెలియండీ. తులసి రెడ్డి మంచి భజన పరుడు. ముందు ఎన్టీఆర్ భజన, తరువాత బాబు భజన, అనంతరం వాజ్‌పేయీ భజన, నెక్స్ట్ వైఎస్సార్ కీర్తన, వెంటనే రోశయ్య స్తోత్రం. సీను మారింది కిరణ్ పూజ. 2004 నుంచి సోనియా స్తుతి.. ఇప్పుడు సమైక్యాంధ్ర.. రేపు జగన్‌ను దేవుడన్నా ఆశ్చర్యం లేదు..

*Opinions,policies and choices change from time to time basing on the needs, whether in politics, journalism or any other fields.

*చంద్రశేఖర్ అజాద్ తో నా స్నేహం, పరిచయం 1978 నుంచి విజయవాడ ఈనాడులో..చంద్రశేఖర్ ఆజాద్, తలశిల నళినీరంజన్ చీఫ్ సబ్ ఎడిటర్లు, అప్పుడు కె.ఎన్.వై. పతంజలి మొదట్లో సీనియర్ సబ్, తరువాత చీఫ్ సబ్‌గ పదోన్నతి పొందాడు. అజాద్ ది ముక్కు సూటి తనం. అయినా మనసు వెన్న, మంచి గంధం. హడావిడి, టెన్షన్ ఉండేవికావు.లౌక్యుడు కాదు. బోళా శంకరుడు. మిన్ను విరిగి మీద పడ్డా చలించని వ్యక్తిత్వం. హైదరాబాద్ వచ్చిన తరువాత చానల్‌కు మారాడు. ప్రెస్‌క్లబ్ లొ చురుకు. ఆయనది కార్డ్స్ బ్యాచ్. ఎన్నికలప్పుడు ప్రతి సారీ ఒక ప్యానల్ తో పోటీ. గెలుపు ఓటముల ప్రసక్తి లేదు. మంచి వాక్ చాతుర్యం, నిజమైన జర్నలిస్టు.. కలం మిత్రునికి నివాళులు..నిజంగా చంద్రుడే..అందరూ చల్లగా ఉండాలని కోరుకునే వాడు. సహచరుడు పతంజలి అంటే ప్రాణం. నళిని నిలదీశేవాడు. గమ్మ్మత్తేమిటంటే.. ఆ ముగ్గురూ మన మధ్య లేరు. అందరూ ఊర్ధ్వలోకాల్లో ఏం రాస్తున్నారో, ఏం చేస్తున్నారో..

*అంతఃకరణంలో దాడులు చేయాలని ఎవరికి ఉండకపోయినా, కడుపుబ్బరం భరించలేని "నారదులే" ఉత్ప్రేరకాలు, ప్రోత్సాహకాలు.  అందుకే ఏడో తేదీ ఎన్‌జీఓల సభ నిస్సారంగా, నిస్తేజంగా ఉందని పాపం కలాలు, గళాలు తెగ బాధపడిపోయాయ్.

*శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే? తెలుసా!
ఎవరైనా చనిపోతే నిర్యాణం ప్రకటన వేస్తామంటూ ఫోన్లు చేసి వెంటపడే తెలుగు పత్రికల టాబ్లాయిడ్ రిపోర్టర్లు..

No comments:

Post a Comment