Saturday 7 September 2013

రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాల చరిత్ర కొద్దిగా తెలుసుకుందాం..

---------------------------------------------------------------------------------------------------





గోవింద్ వల్లభ్ పంత్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఫజల్ అలీ అధ్యక్షతన హెచ్ఎన్ కుంజ్రూ, కె ఎం ఫణిక్కర్ సభ్యులుగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు 1953 డిసెంబరు 22న అప్పటి ప్రథాని జవహర్లాల్ నెహ్రూ పార్లమెంటులో ప్రకటించారు. గవర్నర్ల ప్రావిన్సులను, పూర్వపు పెద్ద రాజసంస్థానాల్లో రాజ్ ప్రముఖ్ వ్యవస్థను అంతమొందించే ఏకైక లక్ష్యం నాటి ఎస్సార్సి ఏర్పాటు.
1950లొ అమలులోకి వచ్చిన రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలు మూడు విభాగాలుగా తయారయ్యాయి. "ఎ" విభాగంలో గవర్నర్ల ఏలుబడిలొ మద్రాసు, అస్సాం, పశ్చిమబెంగాల్, ఒరిస్సా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉండేవి. "బి" విభాగంలో రాజసంస్థానాలు/సంస్థాన కూటములు హైదరాబాద్, సౌరాష్ట్ర, మైసూర్,ట్రివాన్‌కూర్-కొచ్చిన్, మధ్య భారత్, వింధ్యప్రదేశ్, పాటియాలా-తూర్పు పంజాబ్ రాష్ట్రాల (రాజస్థాన్) సంఘాలు ఉండేవి. "సి" విభాగం కింద బ్రిటిష్ హై కమిషనర్ల ఏలుబడిలో డిల్లీ, కచ్, హిమాచల్ ప్రదేశ్, బిలాస్‌పూర్, కూర్గ్, భోపాల్, మణిపూర్, అజ్మీర్-మేర్వార్, త్రిపుర ఉండేవి. వాటిలో ఏ విభాగంలోని రాష్ట్రాలకు సరిహద్దులు స్పష్టంగా లేవు. ఆ ప్రతిబంధకాలు తొలగించేందుకే ఎస్సార్సీ ఏర్పాటయింది. భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటువలన పాలనా సౌలభ్యం కలుగుందని అప్పతి కేంద్ర ప్రభుత్వం భావించింది.

1955జూన్ లోగా నివేదిక అందించవలసిన ఫజల్ అలీ కమిషన్ మరో మూడునెలల సమయం అదనంగా తీసుకుంది. సెప్టెంబర్ 30 న కేంద్రానికి నివేదిక అందజేసింది. ఆ సిఫారసుల మేరకు రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు తొలగిపోయాయి. సరిహద్దులను కమిషన్ నిర్ధారించింది. ఆ ప్రకారం 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, బొంబాయి, జమ్ము-కాశ్మీర్, కేరల, మద్రాస్, మైసూర్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెగాల్ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు రద్దయ్యాయి. అండమాన్-నికోబార్,లక్ష దీవులు, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్, పాండిచేరి, త్రిపుర, మణిపూర్ కేంద్రపాలిత ప్రాంతాలయ్యాయి. 

నివేదికలోని 100- నుంచి 111 పజీలవరకు ఆంధ్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లపై కమిషన్ తన అభిప్రాయం పొందుపరచింది. హైదరాబాద్ సంస్థానాన్ని మూడు భాగాలుగా విడగొట్టి మరఠ్వాదానుబొంబాయిలో, కన్నడ ప్రాంతాలను మైసూరులో, బీదరును హైదరాబాద్ లో విలీనం చేసి హైదరాబాద్ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని సూచించింది. " ఆంధ్ర హైదరాబాద్ ప్రజల మధ్య సజాతీయత లేదని అభిప్రాయపడింది. అయిదేళ్ళపాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా ఉండాలని పేర్కొంది. అయిదేళ్ళతరువాత తెలుగు మాట్లాడే ప్రాంతాలను ఒకే రాష్ట్రంగా చెయ్యాలని చెప్పలేదు. కమిషన్ సిఫారసులన్నిటినీ ఆమోదించిన కేంద్రం హైదరాబద్ విషయంలో సూచనను తిరస్కరించింది. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటుకావాలన్న భావన సర్వత్రా వ్యక్తమవుతున్నందువలన, తెలుగు మాట్లాడేవారిని రెండు రాష్ట్రాలుగా విభజించడం సరికాదన్న ఉద్దేశంతో తిరస్కరించింది. 

ఇక్కడ మరొక్క ముఖ్యమైన విషయం గమనించాలి. స్వాత్నత్ర్యానికి 45 సంవత్సరాల పూర్వమే భాషా ప్రయుక్తరాష్ట్రాల అవసరాన్ని కాంగ్రెస్ తీర్మానించింది. బెంగాల్ విభజనకు 1905లో ఉద్యమించింది కూడా. బ్రిటిష్ ఇండియాలోని రాష్ట్రాలను పక్కనపెట్టి, ప్రాంతాలు, భాషలకు అనుగుణంగా కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేసుకుంది. 1928లో భాషా సంయుక్త రాష్ట్రాలకు అనుగుణంగా తీర్మానం అమోదించింది. దానికి నీహ్రూ నివేదికే ఆధారం. 1946-47లో తన ఎన్నికల ప్రణాళికలో ఆ అంశాన్నే ముఖ్యంగా ప్రస్తావించింది. అయితే దేశవిభజన, మతకల్లోలాల అనుభవాల కారణంగా నెహ్రూ భాషా సంయుక్త రాష్ట్రాలను వ్యతిరేకించారు. కానీ ఆంధ్ర రాష్ట్రం కోసం మొదలైన ఉద్యమ పరిణామాలతో నెహ్రూ మనసు మార్చుకున్నారు. 

స్వాతంత్ర్యానికి ముందునుంచే ప్రత్యే ఆంధ్ర రాష్ట్ర ఆకాంక్ష బలంగా ఉండేది. ఆ సమయంలోనే రాజగోపాలాచారి ప్రభుత్వం ఆంధ్ర జలాలను మదరాసుకు తరలించాలని చేసిన యోచన అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19న ఆమరణ దీక్షకు ఉపక్రమించి నా నెహ్రూ పట్టించుకోలేదు. డిసెంబరు 16న పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో హింస జ్వలించదంతో ఆయన దిగి వచ్చారు. 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ పిమ్మత హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పాటు ఉద్యమం తారస్థాయికి చేరుకుంది.. తదనంతర పరిణామాల వలన ఆంధ్రప్రదెశ్ ఏర్పాటైన విషయం అందరికీ తెలిసిందే..

No comments:

Post a Comment