Friday 1 November 2013

వారం తీరంలో రాజకీయ అల(జడు)లు..


1-11-13.
**రాష్ట్రంలో మూడేళ్ళుగా కనుమరుగైన "ఆత్మ" త్వరలో సాక్షాత్కారం చూస్తూ ఉండండి. విజ్ఞులు నా మాట గుర్తుంచుకోండి..త్వరగా, త్వర త్వరగా తెరమీదకు పాత్ర!!

31-10-13
**ఉద్యోగుల సమ్మె వలననే సమయానికి తుపాను చర్యలు, సహాయ కార్యక్రమాలు అందించలేకపోయామని ముఖ్యమంత్రి గారు బాధ పడ్డారు. అందుకేనేమో రైతులను, బాధితులను ఆదుకోని సహ్హయం అందిచని సమ్మె ఉద్యోగులకు ఉదారంగా రెండు నెలల జీతం అడ్వాన్స్ మంజూరు చేశారు సి ఎం గారు!!

**ఒక జ్యోతి మరొక జ్యోతిని వెలిగిస్తుంది. ఒక అలోచన మరొక అలోచనను రేకెత్తిస్తుంది. ఒక హృదయం మరొక హృదయాన్ని ప్రేమిస్తుంది..

**మీడియా హడావిడి కూడా అంతేగా!! చచ్చిన వాళ్ళను కూడా వదలకుండా చెత్త కథనాలు..

31-1-0-13
**ఈ రిస్ట్ వాచ్ కి నేడు 30వ జన్మదినం.. 
------------------------------------
ఈ రిస్ట్ వాచ్ వెనుక ఒక ఆసక్తికర కథ ఉంది. ఇది నా జీవితంతో పెనవేసుకు పోయింది. నా కాళ్ళు, చేతులు, గుండె, మెదదు మాదిరి శరీరంలో విడదీయలేని ఒక భాగమైపోయింది. నేడు 30 సంవత్సరంలోకి కాలు పెట్టింది. అంటే ముప్పయ్యో జన్మదిన వార్షికోత్సవం జరుపుకుంటున్నది. నా కూతురి కంటే వయసులో ఇది పెద్దది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇది పని చేస్తున్నది. నాకు ప్రియాతి ప్రియమైన హెచ్ఎంటి తయారి.
1963 నుంచి ఇప్పటివరకు నేను రెండు వాచ్‌లు సొంత సంపాదనతో కొనుక్కున్నాను . 1963 ఎస్సెస్సెల్సీ మార్కుల ప్రాతిపదికపై 1964లో (పియుసి) 150 రూపాయల స్కాలర్‌షిప్ లభించింది. ఆ మొత్తం నుంచి 110 రూపాయలు పెట్టి అప్పుడే కొత్తగ మార్కెట్ లో ప్రవేశించిన ట్రెస్సా చతురస్ర వాచ్, మిగిలిన 40 రూపాయలతో ఫ్లెక్స్ షూ తీసుకున్నాను.. అలా ఆ వాచ్ 1984 రెండు దశాబ్దాలపాటు వరకు భద్రంగా వాడుకున్నాను. 


1984 అక్టొబరు నెలలో నిజామాబాద్ కేంద్రంగా ఉత్తర తెలంగాణ నాలుగు జిల్లాల "ఉదయం రోవింగ్ కరెస్పాండెంట్" గా బాధ్యతలు స్వీకరించిన తరువాత, ఒకరోజు ఆవాచ్ కిందపడి పాడైపోయింది. అక్టొబర్ 31 వతేదీ మధ్యాహ్నం గంజ్ మార్కెట్లోని హెచ్ ఎం టి వాచ్ షాపుకెళ్ళి, ఈ వాచ్ 190 రూపాయలకు కొనుగోలు చేస్తుండా ఒక్క ఉదుటున సంచలనం... ఉద్రిక్తత, పెద్దగా కేకలు, అరుపులు, గంబ్దరగోళం. దుకాణం షట్టర్లు హడావిడిగా దించేశారు.. అప్పుడు తెలిసింది ప్రధాని ఇందిరాగాంధి దారుణ హత్యకు గురయ్యారని. వెంటనే బయటకు పరిగెత్తా!! భయానక వాతావరణం. దుకాణ దారు నన్ను లోపలికి లాగాడు. "బయటకు వద్దు. రాళ్ళు విసురుతున్నారు" అంటూ.. గంట సేపు లోపలే కూర్చున్నా. అప్పుడు ఆకాశవాణి డిల్లీ కేంద్ర ఆ వార్తను ధృవీకరించింది. ఈ రోజుకే మరో ప్రాధాన్యత. భారత ఉక్కు మనిషి, భారత తొలి ఉప ప్రధాని, ఆంతరంగిక భద్రతా వ్యవాహారాల మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఇదే రోజు. 

సోదరాగ్రజులు, భగవదనుగ్రహ, గురుదేవ కటాక్ష పాత్రులు, శ్రీ వడ్డాది సత్యనారాయణ మూర్తి గారు ఈ ఏడాది ఆగస్టు నెలలో వారి ఇంటికి ఆహ్వానించి అమెరికానుంచి తాను ప్రేమతో నాకోసం తెచ్చిన రిస్ట్ వాచ్ ను గురూజి చిత్రపటాలను, గ్రంధాలను బహూకరించారు.. రెంటిలో ఏదీ వదులుకోలేను. అందుకే ఇఫ్ఫుడు ఈ రెండు వాచీలు రోజు విడిచి రోజు పెట్టుకుంటున్నాను. 65 సంవత్సరాల జీవన ప్రయాణంలో రెండు చేతి గడియారాలతో 20 సంవత్సరాల ప్రేమానుబంధం, 35 సంవత్సరాల గాఢానుబంధం.. ..

**ఒక ప్రళయమో, విపత్తో, ప్రమాదమో, బాధో, హ(అ)త్యాచారమో జరిగినప్పుడు వెంటనే కవితలు, పరామర్శలు, సంతాపాలు గుట్టల గుట్టలు. కొవ్వొత్తి ప్రదర్సనలు, సామూహిక ప్రార్ధనలు, బ్యానర్ల ఊరేగింపుల వరద..మంత్రులు, అధికారగణ బాధ్యతారహిత ప్రకటనలు, ప్రభుత్వ వైఫల్యంపై పంచాంగం, రాజకీయనాయకుల పరామర్శ పర్యటనలు, విమర్శల తుపాను, ఉద్వేగ ప్రసంగాలు, పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిపై పత్రికలు, చానళ్ళ మూకుమ్మడి దాడులు, ప్రశ్నాస్త్రాల సంధన, పైత్యప్రకోపాలతో ఊహాతీత కథనాలు.. ఇవన్నీ అమానుషం..లోపాలు ఎత్తి చూపడంలో ఉత్సాహం సాయం చేయడంలో కనబడదు. అదీ విచారకరం..

29-10-13
**పదవులాట తెలీకపోతే పడవ బోల్తా.. అనుభవమే పాఠం చెబుతుంది..ట్యూషన్ ఉండదు..
**అంతా టేకులు.. రీ టేకుల జీవితం కదా.. రాజకీయలో రీళ్ళుండవని, అన్నీ కన్నీళ్ళేనని..తెలీదులేమ్మా!
**అయిదేళ్ళ కాపురం అనివార్యం. అయితే పీఠమెక్కిన వాడికే విడాకుల(రాజీనామా) అవకాశం. ఎక్కించిన మనకునచ్చకున్నా "అత్యధికులను" భరించాల్సిందే.. మన తిరస్కారం వాళ్ళకు పురస్కారం..

28-10-13
**ఆ ముక్కాయల చూర్ణాన్ని రంగరించి ఎప్పుడూ ముక్కులో వేళ్లెట్టుకునే ఆయన కర్ణాల్లో పోశారుట. అంతే..నసాళానికంటింది.. నాలుగేళ్ళబట్టీ ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా, (వి)భజనొచ్చినా, నోరెళ్ళబెట్టి "వస్తున్నా మీ కోసం" అంటూ -ఆత్మగౌరవ- ఘోషలతో భూప్రదక్షిణలు మొదలయ్యాయి. ఇక భూకంపాలే...

**(పాత్రికేయ)మైకంలో ఉన్నాను మన్నించండి.. ఈ మాటలు, చేతలు నావే కావూ(అక్కినేని పాట). నాక్కాస్త తిక్కెక్కువ.. దానికి లెక్కలేదు..

**No beating round the bush..all direct answers No.1) JP will not change politics, but he will change, 2) how do you expect a vision-less person will do justice at all? 3) Congress sees no betterment 4) BJP is the only alternative for the present, first let it come to power then we can talk of miracles..,5) yes, people are looking for two states.. I am always impartial.. that is cent percent true to my conscious..

**గొట్టాలు గుట్టలుగా తయారయ్యాయి.. కలాలను కులాలు కమ్మేసాయి.. చెడు-వినకు, చెడు-కనకు, చెడిపోకు.

26-10-13
**ఇవ్వాళ అత్తల దినమట..
నేను గనక ఒక ఈల గనక వేశానంటే....
కొందరు కోడళ్ళు ముళ్ళ మీద కుళ్ళుకుంటూ, మరి కొందరు.. ఎంత సంతోషమో!!
అత్తయూ ఒక ఇంటి కోడలే కాని.. ప్రతి కోడలు అత్త కావాలన్న రూలు లేదు..అదీ అసలు కిరికిరి.
**

25-10-13
**ప్రపంచ మేధావిగా, రాజనీతిజ్ఞునిగా పేరొందిన పివి ప్రధాని పదవి నుంచి వైదొలగిన తరువాత గాంధీ భవన్ కు పలు మార్లు వస్తే. ఒక్క నాయకుడు తోంగిచూడలేదు.. వెనుక ఉన్న గ్రంధాలయంలో కొద్దిసేపు కూర్చునేవారు. పత్రికా ప్రతినిధులూ ముఖం చాటేశారు... అందుకే ఆయన కార్యక్రమాలు రామానందతీర్థ కార్యాలయానికి పరిమితి చేసుకునే వారు. మనం కాదంటే ఆయనను రాంటెక్ ప్రజలు ఆదరించారు.
**కొన్నిచోట్ల మానవ సంబంధాలు మాయమవుతున్నా.. మెషిన్ సంబంధాలు కొన్ని నాగార్జున సిమెంట్ లా పటిష్టమవుతున్నమాట వాస్తవం..

1 comment:

  1. చిటపటమని పేలుతున్నాయి సార్

    ReplyDelete