Monday 25 November 2013

వారంలో గరం మసాలా!! వేడి, వేడి వ్యాఖ్యలు    

[weekly summary of political comments]
24-11-13
*Press Club, Hyderabad elections could have not been conducted in such a decent, dignified and disciplinary manner without the co-operation of each and every member. Mr Bhandaru Srinivas Rao, Returning Officer has set a record in the history of Press Club by utilizing all the available and advanced technology to inform each and every thing minute by minute. Another land mark in the history of Press club was announcing results of five office bearers and six EC members within two hours after completion of polling. Total transparency was maintained in such a manner without giving any scope to raise even a single objection by contestants/agents/members. Election staff from the Cooperative department had done excellent job in conducting the poll, making arrangements, counting votes and announcing results. I am happy for associating with Mr Bhandaru for all these seven days (from the date of commencement of filing nominations and to declaring results).

*So called wise, educated, intellectuals and watchdogs of the society (members of the Press Club, Hyderabad ), who opposed the EVMs are going to elect their office bearers and EC members today(Sunday). Polling - from 11.30 am to 6 pm.

23-11-13

*డంబు, చెంబు, అని తేలిగ్గా తీసెయ్యకండి.. ప్రతి ఇంటికి అది అవసరం.. చెబుకోసం చాలా ఏళ్ళు ఎగబడిన జనాలు కోకొల్లలు..
అసలు ఒక పద్యం ఉంది.. "చిన్న చెంబుతో నీళ్ళు శీకాయ ఉదకంబు..."
22-11-13

*స్టింగ్ ఆపరేషన్లతో జనాలను పరేషాన్ చేసిన తేజ్ పాల్ అసలు స్వరూపం బయటపడింది కదా!
రోజూ నాగోడు అదే.. మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులు వేరు. జర్నలిస్టుల్లో నేరస్థులు వేరు.
గోతులు తీసేవాళ్ళే నీతులు చెబుతారు.. అవినీతిపరుడే నీతి గురించి ఎప్పుడూ మాట్లాడతాడు. ఇవ్వాళ పేపర్లు, చానళ్ళలో నీతులు మాట్లాడుకోవడం వేస్ట్..

21-11-13

*జెసి దివాకర్ రెడ్ది అనే కాంగ్రెస్ సీనియర్ నేత (అయిదేళ్ళుగా ఎమ్మెల్యే మినహా ఏ పదవీ లేదు..వోల్వో బస్సులు మాత్రం చాలా ఉన్నాయి) సిఎల్పీ కార్యాలయం వద్ద అక్షర సత్యాలు చెప్పారు:
ఏట్లో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ ఆపలేదని తెలిసినా దాన్ని పట్తుకునే ప్రయత్నం జరుగుతుంది.రాష్ట్ర విభజన అడ్డుకునే విషయంలోనూ మాది అదేప్రయత్నం..
నీజమే...కాంగ్రెస్ లో ఉన్నదంతా గడ్డిపోచలని తెలిసికూడా ప్రజలు ఇన్నేళ్ళుగా వాటినే పట్టుకుని కొట్టుకుపోతున్నారు..
సీమాంధ్ర సమైక్య ఉద్యమం గడ్డిపోచలదని తేల్చి చెప్పేసారు ఆ సారు వారు. మరో గాదె (వెంకట) రెడ్డి గారు దాన్ని బలపరచారు.. జై గడ్డిపోచలూ!!

*దేశవ్యాప్తంగా ఎన్నికల్లో ఇవిఎంలు ఉపయోగిస్తూ ముందుకు పోతుంటే విచిత్రంగా హైదరాబాద్ పాత్రికేయుల్లో కొందరికి ఎవిఎంల పనితీరుపై ఎన్నెన్నో అనుమానాలు తొలుస్తున్నాయి. 1300 మందికిపైగా వోటర్లున్న హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌కు ఈ నెల 24న ఎన్నికలు జరుగుతున్నాయి. కొందరి అనుమానాల వలన ఎన్నికల్లో ఇవిఎంలను ఉపయోగించే ప్రయత్నాలకు గండిపడుతున్నది.
వోట్లువేయని బాగా చదువుకున్నోళ్ళకు, రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల్లో ఎవిఎంల పై అనుమానాలు. ప్రజలు వోట్లు వేసి తమ పని తాము చేసుకు పోతున్నారు. అనేక ప్రభుత్వ, ప్రైవేటు ఎన్నికల్లో ఎవిఎంలే వాడుతునారు. మరి జర్నలిస్టులకే ఎందుకు అభ్యంతరమో!! ఎవిఎంల వలన పోలింగు వేగవంతమై, కౌంటింగు కేవలం ఒకటి రెండు గంటల్లో పూర్తవుతున్నది. అనేక దైనందిన కార్యకలాపాల్లో కాలహరణం, శారీరకశ్రమ నివారించుకునేందుకు , శాస్త్రీయత, సాంకేతిక మార్గాన్ని ఎంచుకున్నాం బ్యాంకుల్లో శారీరక శ్రమ తగ్గడం వలన పని వేగవంతమైంది. ప్రయోజనాలు విస్తృతమయ్యాయి. ప్రజలు అలవాటుపడి సుఖ పడుతున్నారు. అనేక ఆలోచనలు పుట్టుకొచ్చే పాత్రికేయులకు ఎవిఎంలపై అపనమ్మకమేమో!
(ప్రపంచంలో ఏకైక సంస్కరణకర్తగా చెప్పుకున్న చంద్రబాబు నాయుడు అనేక సార్లు యు టర్న్ తీసుకున్నారు. మద్యం విషయంలోనైనా, ఉచితాల విషయమైనా. ఐటి విషయమైనా, చివరకు ఎన్నికల్లో ఇవిఎం ల ప్రవేశమైనా తన ఘనతగా చెప్పుకున్నప్పుడు పత్రికలు ఓహో అన్నాయి. అదే బాబు ఎన్నికల్లో ఓడిపోగానే ఇవిఎంలు అశాస్త్రీయమని దేశవ్యాప్త వివాదం, చర్చ లేవనెత్తారు. అప్పుడు కొందరు పాత్రికేయులు కూడా అవునని వంత పాడారు.)

*ప్రపంచానికి మార్గదర్శకులు జర్నలిస్టులు అని చాలామందికి అపోహ. ఎందుకంటే వారు అన్నీ నిజాలు చెబుతారనో, సమాజంలో మార్పును ఆకళింపుజేసుకుని అందరికీ వివరిస్తారనో.. నేనంటాను తమకు నచ్చనిదాన్ని ఇతరులకు నచ్చకుండా, తాము మెచ్చినదాన్ని ఇతరులు మెచ్చేలా చేయడమే వారి ప్రయత్నం, కర్తవ్యం. వాదోపవాదాలకు ఆద్యులు పాత్రికేయులే కదా!! యాజమాన్య ప్రయోజనాలను, స్వార్ధ ప్రయోజనాలను.. రెండింటిని వారు భుజాలకెత్తుకుంతారు. విస్తృత, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం కాదు..ఇది ఇప్పటి పరిస్థితి. నన్ను ఎందరు కోపగించుకున్నా పరవాలేదు. పత్రికల పాఠకులకు,, చానళ్ళ వీక్షకులకు ఇది అనుభవమే.
20-11-13

*గొంగట్లో తింటున్నాం. ఇక్కడ మనం మెతుకులేరుకోవాలి.. వెంట్రుకలు కాదండి..
అందరూ "సంపాదకులే" తయారయ్యారు ఈ క(కా)లంలో, వారిలో పాత్రికేయులను తెలుసుకోవాలి. అది డబ్బులిచ్చి పేపరు కొనుక్కునే పాఠకునికి అగ్ని పరీక్ష. .
(ఎర్నలిస్టుల్లో జర్నలిస్టులెందరు? అని)

*తెలుగు పిచ్చి మరీ ముదిరిపోతున్నది..సామాన్యునికి అర్ధంకాని రీతిలో కొత్త తెలుగు పదాల ప్రయోగం.. ఈనాడు లో ఈ రోజు ఉపయోగించిన పదాలు ఇలా..
ఔటర్ రింగ్ రోడ్= బాహ్య వలయ రహదారి;
వర్క్‌షాప్= కార్యశాల..

మిత్రులందరికీ ధన్య వాదాలు. తమ తమ అభిప్రాయాలు వ్యక్తీకరించినందుకు.. ఆ... ఆలు రానట్టి అన్నయ్య లందరూ రాజకీయ మద్దతుతో 'అకాడెమీ' అధ్యక్షులవుతున్నారు. ఇక పత్రికల విషయానికొస్తే "ఎడిటర్లు" ఎప్పుడో అంతర్ధానమై నిజమైన "సంపాదకులే " మిగిలారు.
సతీష్ బాబుకు కృతజ్ఞతలు.. నీ వంతు కృషిగా మన అజ్ఞానుల విజ్ఞాన సంపదను శ్రోతలు/వీక్షకులకు నీ "జర్నలిస్టు డెయిరీ" ద్వారా పంచిపెడుతున్నదుకు.
19-11-13

**మంత్రులు, మాజీలు అందరూ జగన్ శిబిరంలో చేరాతారని నెలకిందట రాసిన మాటలు నిజమవుతున్నాయి .. మోపిదేవి వెనుక ధర్మాన ప్రసాదరావు క్యూలో నిల్చున్నరు చూశారా!! నిన్నటి వరకు జగన్ ను తిట్టిన తిట్టు తిట్టకుండాతిట్టారు. ఇప్పుడు ఏముఖంతో...???
సీమాంధ్ర ఎంపీలు, మంత్రుల దోబూచులాట కొద్దిరోజుల్లో బయటపడుతుంది..రంగు బయటకొస్తుంది.
**ఒక సమస్య(పరిష్కారం) మరో సమస్యకు దారితీయకూడదు: డిల్లీలో జిఓఎం ఎదుట సి.ఎం.
నిజమే, ఒక సమస్య పరిష్కరించుకునే ప్రయత్నంలో చేసినవన్నీ పెద్ద సమస్యలు సృష్టించుకోవడమే... జగన్ సమస్యకు పరిష్కారమనుకుని రోశయ్యను పెట్టారు. రోశయ్య సమస్యను సరిదిద్దుకునేందుకు కిరణ్ ను మార్చారు. ఇప్పుడు కిరణ్ సమస్య అయి కూర్చున్నాడు..
**నేను చెప్పిందే కరెక్టయింది.. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు జారి పోయారు, దిగజారిపోయారు. ముఖ్యమంత్రివాదాన్ని కూడ బలపరచలేదు. జావ కారిపోయారు. సొమ్ము మీదనే దృష్టి..
"విభజన అనివార్యమైతే హెచ్.ఎం.డి.ఎ. ప్రాంతాన్ని డిల్లీతరహా కేంద్రపాలిత ప్రాంతం చెయ్యాలి, సీమాంధ్రకోసం ఏటా 40 వేల కోట్ల వంతున 20 యేళ్ళు ఆర్ధికసాయమ చెయ్యాలి, భద్రాచలమ, అస్వారావుపెట.. తిరిగి సీమాంధ్రలో చేరచాలి, సీమాంధ్ర 13 జిల్లాల్లోనూ అభివృద్ధి విస్తరింపజెయ్యాలి,బిల్లు అసెంబ్లీకి పంపినప్పుడు తగిన సమయం ఇవ్వాలి...." డిల్లీలో నిన్న వారి మాటలు ఇవీ! మరి ఈ నాయకులు ఏపి ఏర్పడినప్పటినుంచి 13 జిల్లాలను ఎందుకు అనాధలుగా మిగిల్చారట?
కాంగ్రెస్ లో ప్రజారాజ్యం పార్టీ విలీనం(నిమజ్జనం) చేసినప్పుడు మెగా అనుకున్న చిరు చెప్పింది గుర్తుందా?
"కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు నాపై నమ్మకముంది. నావల్ల పార్టీ ప్రయోజనం పొందుతుంది".. నిజమే కదా ప్రజలు ఏమైనా పార్టీకి లాభం చేస్తున్నారు.

18-11-2013

**ప్రపంచ తెలుగు ప్రజలారా ఏకమవుదాం, తెలుగు ప్రజలంతా ఒకటే, సమైక్యాంధ్రకోసం ప్రాణాలిస్తాం, విభజన ఆపే వరకు పోరాటం, పార్టీ కంటే ప్రజలే ముఖ్యం, విభజన అనివార్యమైతే సమన్యాయం సాధిస్తాం, విభజన తప్పేట్లు లేదు సీమాంధ్ర ప్రయోజనాలు పరిరక్షిస్తాం, మరో పార్టీ పెడతాం, హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోం, కనీసం పదేళ్ళూ ఉమ్మడి రాజాధానిగా ఉంచాలి, రెవెన్యూలో సింహ భాగం ఇవ్వాల్సిందే, యూనియన్ టెరిటరీ కోసం పోరాటం. కొత్త రాజధానికి, భారీగా నిధులివ్వండి, భద్రాచలం ఆంధ్రులది, కనీసం దాన్నయినా మాకు దక్కేట్లు చెయ్యాలి. మేము రాజీనామాలు చేస్తే విభజన ఆగుతుందా? మేము ఇంత ఎదగడానికి పార్టీ ఆశీస్సులే కారణం, కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలకే కట్టుబడి ఉంటాం.మరో ఆలోచన లేదు........
ఇదంతా వింటుంటే.. చదూతుంటే ఏమి అనిపిస్తుంది?
నాకైతే ఈ భర్తృహరి సుభాషితం గుర్తుకొస్తుంది....
@ఆకాశంబుననుండి శంభుని శిరం బందుండి శీతాద్రి సు
శ్లోకంబైన హిమాద్రినుండి భువి భూలోకంబునందుండి య
స్తోకాంబోధి బయోధినుండిపవనాంధోలోకముం జేరె గం
గాకూలంకష పెక్కుభంగులు వెవేక భ్రష్ట సంపాతముల్.....

15-11-13

**ఒకవైపు తెలంగాణ, మరొకవైపు సమైక్యాంధ్ర.. ఈ గొడవ తప్ప.. ఇప్పుడు మరో విషయమే లేదు. జాతీయ గ్రంధాలయ వారోత్సవాలకు ఒక్క సాహితీ విశాఖే పట్టంకట్టినట్లుంది.. ఎఫ్‌బీ మొత్తంలో అక్షర రాగాలాపన అక్కడనుంచే వినిపిస్తున్నది..

**ఇప్పుడు దేశ జనభా 130 కోట్లుటండీ.. కాంగ్రెస్ పార్టీకి కూడా 130 సంవత్సరాలు సమీపిస్తున్నాయ్.. దరిద్రాలు శతకం ..  కరక్టే కదా!!

*ఇదేకదా(అ)రాచకీయం.. "టి" లో ఉండాలని 72 గంటలు బందట! "సీ" లో కలపాలకి వాళ్లేమిచేస్తారో? తెలుగు నేలపై కాలు పెట్టినందుకు పాపం దేవుడుగా కూడా రాముడికి కష్టాలే.. (భద్రాచలాన్ని తెలంగాణా నుంచి విడతీసి సీమాంధ్రలో విలీనం చేస్తారా లేక తెలంగాణాలోనే వుంచుతారా అనేదానికంటే ఆశ్చర్యపరిచే అంశం ఏమిటంటే - కలసి వుందామని వాదించే సమైక్యవాదులు 'విడతీయాలని' అంటున్నారు. విడిపోవాలని వాదించే విభజనవాదులు, కలిపే వుంచాలని అంటున్నారు--.భండారు గారి పోస్టింగ్ )

14-11-13
**మొయిలీగారు డిల్లీలో ఆటో ఎక్కారట. నెహ్రూ దిగొచ్చినంత సంతోషంగా పత్రికలు ప్రముఖంగా ఫోటోలు వేశాయి.
మొయిలీకి నా చాలెంజ్: దమ్ముమంటే హైదరాబాద్ వచ్చి మీటరు రేటుకు ఆటో ఎక్కు... నీ చిన్నప్పటినుంచి ఇలాంటి జిమ్మిక్కులెన్నో చూసింది ఈ దేశం.
.. వాజ్‌పేయీ పార్లమెంటుకు ఎడ్ల బండిలో వచ్చారు. నీకు తెలీదేమో!
..ఎన్టీ రామారావనే ముఖ్యమంత్రి అబిడ్స్ లోని తన ఇంటినుంచి సెక్రెటరియట్ కు ఆటోలో వచ్చాడు ఒకసారి.

1 comment:

  1. వడ్డింపులు బాగున్నాయి.

    ReplyDelete