Thursday 5 December 2013


                     కసరత్తులు - చురకత్తులు
                     ------------------------------                  

                          (పది రోజుల రాజకీయ కోలాహలం) 


5-11-13
*మనలో మార్పు రానంత వరకు ఈ అవినీతి, బంధుప్రీతి, కుళ్ళు రాజకీయాలు అంతే...పార్టీ భజనలు, వ్యక్తి ఆరాధనలు, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం, సబ్సిడీలకు, ఉచితాలకు తలవంచడం, కులాభిమానాలు మానేసి అభ్యర్ధి నిజాయితీ, అర్హతలు, నైతిక ఋజువర్తన ప్రాతిపదిక పై ఎన్నుకుంటే మనకు కావాలిస్న ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రచార సాధనాల మాయకు గురైతే ఇంతే సంగతులు.. మార్పు కోరాలి..ఉత్తరాది నాలుగు రాష్ట్రాల మాదిరి చరిత్ర తిరగరాయాలి..
*ప్రతిపాదనలు, ఉపసంహరణలు, రహస్య చర్చలు, సంప్రదింపుల గురించి మనం చదివేదీ, వినేదీ అన్నీ అర్ధ సత్యాలే! అని గమనించాలి. మీడియా పనికట్టుకుని ఒకటి రాస్తుంది. దానిపై టీవీలు చర్చలు నిర్వహిస్తాయి, టీవీ కొత్త కథనం వినిపిస్తుంది. వాటిపై పత్రికలు పుంఖానుపుంఖాలుగా రాస్తాయి. అనీ వింటాం, చదువుతాం బుర్రలు బద్దలు కోట్టుకుంటాం. గందరగోలం.. ఇద్నతా రాజకీయంతో పాత్రికేయం చేతులు కలపడం. పెద్ద నాటకం. ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్ళించడంలో ఇవన్నీ భాగాలు..

4-12-13
*ఏపి కాంగ్రెస్‌ది అయిరన్ లెగ్.. గతంలో గుజరాత్ ఎన్నికల పరిశీలకుడుగా మన పొంగులేటి సుధాకర్ రెడ్డి వెళ్ళారు. అంతే కాంగ్రెస్ మటాష్.. ఇప్పుడూ అంతే.. మన మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు డిల్లీ పరిశీలకుడుగా కాలు పెట్టారు. షీలా దీక్షిత్.. ఫట్..
నీతి:: దేశంలో ఎక్కడైనా కాంగ్రెస్ ను ఓడించాలంటే మన నాయకులను అబ్జర్వర్లుగా పంపాలి- గుజ్జు గుజ్జవుతుంది. అది ప్రధాన సూత్రం..
*ఒక పత్రికాధిపై "నిర్భయ" చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆఘనత మన రాష్ట్రానికే దక్కింది. వార్త సిఎండి, కాంగ్రెస్ మాజీ ఎంపి, నెలలతరబడి జీతాలివ్వని యజమాని గిరిష్‌సంఘి సికిందరాబద్ కంటోన్మేంట్ సి ఇ ఓ సుజాత అనే మహిళాధికారిని అసభ్యంగా దూషించిన ఫిర్యాదుపై బేగంపేట పోలీసులు కేసు కట్తారు. పోలీసు అనుమతిలేకుండా ప్రదర్శననిర్వహించి చట్టాన్ని ఉల్లంఘించిన కేసు కూడా నమోదయింది. కొడుకు పెళ్ళి సాకుతో హైకోర్టులో ఆ మహానుభావుడు యాంటిసిపేటరీ బైల్ పొండాడు. ఈ మహానుభావుడిపై సొంత అన్నదమ్ములే క్రిమిన కేసులి పెట్తారు.ఇదీ మన తెలుగు పత్రికా ప్రపంచపు గొప్పతనం. బ్లాక్ మెయిలర్లు, ఫొర్జరీగాళ్ళు, కబ్జాగాళ్ళు..పత్రికాధిపతులు..
*ఉత్తరాదిన కాంగ్రెస్ చెయ్యి విరిగింది అయిదు వేళ్లలో చిటికెన వేలు మాత్రం మిగులుతున్నది.. చేతికి తరు"వాత" అక్షరక్రమలో అగ్రభాగాన ఉన్న ఆంధ్రప్రదేశ్.. దాంతో దక్షిణాదిన హస్తం మాయం.. ఇక అంతా అస్తవ్యస్తమే!! మోడీతో ఢీనా? మాడు పగుల్తుంది..
*
3-12-13
*విడిపోతున్న తెలంగాణాను ఫెవికాల్ పెట్టి అతికించ ప్రయత్నించినట్లు..
*ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం నుండి 12 మంది సమైక్య సీమాంధ్ర నేతలు పరారీనా? అదెట్లు జరిగె?
*poli-trics degenerating..

2-12-13
*డిసెంబరు 9 మరొక భయంకర తుపాను.. దానికి "సోనియా" అని పేరెడతారు. పది జిల్లాలు ఒక వైపు- 13 జిల్లాలు మరో వైపు కొట్టుకుపోతాయ్!!

29-11-13
*సమైక్య రాష్ట్రం కోసం చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం..అందరూ అలసి, సొలసి ఆయాస పడిపోయారు. సమైక్య రాష్ట్రం కోసం డిల్లీ ప్రయాణాలు, యాత్రలు, దీక్షలు, రచ్చబండ పగుళ్ళు, వస్తున్నా నడకలు, శంఖారావాలు, భీషన ప్రతిజ్ఞలు...లైలా, హెలెన్, లెహెర్.. అన్నీ తుపానులే. మొత్తం తుడిచేసింది.. రాష్ట్రాన్ని కడిగేసింది. తేదీలు కూడా ఫిక్స్ అయ్యాయి తెలంగాణపై. ఇప్పుడేమంటారు మన పీతల నేతలు? మన పనిలేని మంత్రులు ఏమిచేస్తున్నారు?  సోనియా, రాహుల్, మన్మోహన్, అహ్మద్‌పటేల్, గులాంనబీ, మొయిలీ, దిగ్గిభయ్యా, షిండే, జైరాం.... అందరూ దివంగత రాజశేఖరరెడ్డికి ప్రీతిపాత్రులు. ఆంతరంగికులు.. అందరూ అయిదేళ్ళు ఒకరి మనసొకరు ఎరిగి నడుచుకున్నారు. ఒకరినొకరు కీర్తించుకున్నారు. మరి వీరందరూ ప్రత్యేక తెలంగాణాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు? దీని వెనుక మతలబేమిటి? వైఎస్సార్ గురించి ఆప్తులు, ఆత్మీయులు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడరేమిటి? అంతా సైలెన్స్. లైట్స్ ఆఫ్. ప్యాకేజీలతో ప్యాక్-అప్!!!

*తెహెల్కా సిబ్బంది కానీ, భారత్ యావత్తులో ఒక్క జర్నలిస్టు కానీ, ఒక్కరూ పాపం తేజ్ పాల్ కు మద్దతుగా నిలవలేదు ఎందుకో? పత్రిక నోరు నొక్కేస్తున్నారని, పత్రికా స్వేచ్ఛని కాల రాస్తున్నారని ఎవ్వరూ ఉద్యమాలు లేవనెత్తలేదు. చివరకు తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమాచౌదురి, తెహెల్కా ఫౌండేషన్ నుంచి అరుణా రాయ్ కూడా తప్పుకున్నారు..
ఇదంతా సరే, కొన్నాళ్ళయిన తరువాత కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో.. తేజ్ పాల్ కు ఇతరత్రా భాగస్వాములెవరో??
(మరి మీడియాల్లో అలాంటి "తేజ్ పాల్స్" ఎందరు ఉన్నారో?)

*మొత్తం వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ఢి  సమతుల్యంలో సాగుతుంది. సచివాలయం, శాసనసభ, పోలీసు ప్రధాన కార్యాలయం, ఉన్నత న్యాయస్థానం, పరిశ్రమలు, విద్యా, వైద్యాలను వేర్వేరు కేంద్రాలలో నెలకొల్పితే  భవిష్యత్తులో సమస్యలు ఉత్పన్నం కావు. రాజకీయ రాజధాని, ఆర్ధిక రాజధాని, న్యాయసేవా రాజధాని, ఆధ్యాత్మిక రాజధాని, పర్యాటక రాజధానులుగా ఏర్పడితే అందరికీ ఆని అవకాశాలు అందివస్తాయి. సమాచార, సాంకేతిక విస్తరణ విప్లంతో ప్రపంచమే ఒక గ్రామమైనప్పుడు నిర్వహణ ఏదీ అసాధ్యం కాదు..విభేదాలు, విమర్శలు మానుకోవాలి అందరూ!!
*నాకెన్ని గుర్తింపుకార్డులున్నాయో!!!. ప్రతి పనిలో ఒకటి. ప్రతి పనికి వేరొకటి.. ఈ దేశంలో ఇన్ని అవసరమా? మనిషి ఆజన్మాంతం అన్నింటికీ ఉపయోగపడే ఒకే కార్డును మనం రూపొందిచుకోలేమా!!! (మాధవి ఆధార్‌కార్డ్ కథనం స్ఫూర్తి తో..)
[ఐ డి కార్డ్స్ ను ఆన్ లైన్ నేరస్తులు హాక్‌చేసి దుర్వినియోగం చేస్తారన్న ప్రభాకర్‌రావు గారి హెచ్చరికపూరిత సలహాతో ఫొటో డిలీట్ చేశాను..] --అయితే ఆధార్, ఆరోగ్యశ్రీ,, రేషన్, ధన్వంతరి ఫౌండేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, ఆర్గనైజషన్, అక్రెడిటేషన్, ఓటర్ ఐడెంటిటీ, ఇన్సూరెన్స్, అసెంబ్లీ మీడియా ఐడెంటిటీ, రైల్వే ఐడి, బ్యాంక్, హౌజింగ్ సొసైటీ, ప్రెస్‌క్లబ్, పాస్‌పోర్ట్...వగైరా కార్డులున్నయ్ ప్రస్తుతానికి..
28-11-13

*ఫ్రతిపక్షం: కాంగ్రెస్ కు చీము, నెత్తురు, సిగ్గు., లజ్జ, అభిమానం ఉంటే వరల్డ్ బ్యాంక్ నిషేధించిన ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ ఓనర్ కావూరిని వెంటనే పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి బహిష్కరించాలి..
ఏఐసిసి అధికార ప్రతినిథి: చాల్, చాల్లే పోవోయ్! అలా అయితే మా కాంగ్రెస్‌లో ఒక్కరూ మిగలరు, దుకాణం మూసుకోవలసిందే తెలుసా??

27-11-13

*చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైనట్లు..
అని మనం చదువుకున్నాం...
మహానుభావులు నడయాడిన పవిత్ర ప్రజాస్వామ్య ఆలయంలో(శాసన సభ ప్రాంగణంలో) తాచులు,పింజరులు, కట్లపాములు తలదాచుకుంటున్నాయ్!!  

26-11-13

*ఎన్టీ రామారావు మినహా ఎవ్వరూ రెండు సార్లు మించి ముఖ్య మంత్రిపదవిలో కొనసాగలేదు. కేవలం బ్రహ్మానంద రెడ్డి, చంద్రబాబు మాత్రమే వరుసగా ముఖ్యమంతిగా ఏడు సంవత్సరాలకు పైగా పదవిలో ఉన్నారు..ఏకబిగిన పదేళ్ళపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగిన ఘనత "ఒకే ఒక్కడు" చంద్రబాబు కు దక్కింది.. 57 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ లో నలుగురు తెలంగాణ నేతలు మొత్తం తొమ్మిదేళ్ళ అయిదు నెలల కాలం మాత్రం ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు.

25-11-13

*ఇవ్వాళ మన మూడేళ్ల ముఖ్యమంత్రి గారు తేల్చేశారు::
"సమైక్యమా- కాంగ్రెస్ పార్టీనా? అని తేల్చుకోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆలోచిద్దాం".
వెంటనే మరో మాట కూడా: "రాజకీయ లబ్దికోసం ఏ పార్టీ లోనైనా కలవొచ్చు. దాన్ని ఆమోదిస్తాం".
ఆ పార్టీ పేరుకూడా చేబితే ఆంధ్ర ప్రజలు ధన్యులయ్యే వారు కదండీ....
కాంగ్రెస్సాయన తిరిగి ఏ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటాడో!!!

No comments:

Post a Comment