Wednesday 18 December 2013

పెళ్ళి కుదరదు-పిచ్చి తగ్గదు.. 
రాజకీయం రంగుల మయం.. 
వారంలో  వ్యాఖ్యల వాతలు..

17-12-13

*నాకు తొలగని ఆశ్చర్యం ఒకటే.. హైదరాబాద్ నగరంలో ఏ టూ వీలర్, ఫోర్ వీలర్ మీద చూసినా స్టిక్కర్లే స్టిక్కర్లు.. "ప్రెస్, డిఫెన్స్, డాక్టర్, కార్పొరేటర్, యూత్ కాంగ్రెస్, మిలిటరి, ఆర్మి, జిహెచ్ఎమ్‌సి, ట్రాన్‌స్కో.." ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్ల సంగతి చెప్పక్కరలేదు..అని. హైదరాబద్ నగరంలో మాంసం తీసుకెళ్ళే స్కూటర్లమీద, ఆటో ట్రాలీల మీదా కూడా పెద్దక్షరాల్లో కనిపిస్తాయి "ప్రెస్" అని. మన రాష్ట్రంలో, ఇంకొన్ని రాష్ట్రాల్లో ఎన్నోచోట్ల తిరిగా. ఈ వింత ఎక్కడా కనబడలేదు.!!

*నాలుగు దశాబ్దాల నిఖార్సయిన కలంతో నిజాల నిప్పులు వర్షం కురిపిస్తూ, సహచర పాత్రికేయులను ఆత్మీయాతా "పాశం" తో బంధించి, వారి "యాద్"లో "గిరి" శిఖరమై నిలిచిన "పాశం యాదగిరి" మిత్రుని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసిన శుభతరుణంలో ఆప్తునికి అభినందన మందార మాల. ఆంధ్రపత్రిక, ఈనాడు, ఉదయం దినపత్రికల్లో కలాన్ని ఝళిపించి, "వర్తమానం" పత్రికకు స్వయానా సారధ్యం వహించిన అక్షర యోధునికి మరోసారి హృదయపూర్వక శుభాభినందనలు.

*సోదరి మాధవి ఈ నెల 15వ తేదీ వ్యక్తపరచిన భావానికి ఈ కిందివిధంగా నా అభిప్రాయం చెప్పాను---
"ఫేసు బుక్కులో ఫేకు లుక్కుల ముఖాలు.. మహాకవి శ్రీ శ్రీ ఎప్పుడో చెప్పాడమ్మా!! కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అని..అయితే కొందరు వృద్ధులకు పిదపకాలం బుద్ధులుంటాయి. వాళ్ళయినా వీళ్ళయినా, భాష, సంస్కృతి వంటబట్టని విశృంఖలతత్వం ఎక్కువవుతున్నది. అతి చనువు తీసుకుంటున్నారు కొందరు.." -----
నేటి సాక్షి దినపత్రికలో చూడండి.. వారూ అదే అన్నారు.."ఫేసు బుక్కులో ఫేకు లుక్కులెక్కువ"య్యాయని.
ఇందులో ఆడా మగా తేడా లేదు. తమ గురించి ఇతరులేమనుకుంటున్నారో తెలుసుకునే నెపంతో కొందరు, ఇతరులపై పరోక్షంగా అక్కసు వెళ్ళగక్కేందుకూ ఈ ఫేకు లుక్కుల, లైకు సామ్రాజ్య అకౌంట్లు సాగిస్తున్నారు. పాపులారిటీ పెంచుకునే ఈ ప్రక్రియలో ఆడా మగా తేడా లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలి.

16-12-13

*జనాలకు మాదిరే, జ్వాలలు పలు రకాలు.. విరహజ్వాలలు, ఆగ్రహజ్వాలలు, అసూయజ్వాలలు, చలిమంటలు, చితిమంటలు, అక్కసుమంటలు, కడుపుమంటలు....ఆకలిమంటలు మినహా అన్నీ మనుషులను, మనసులను నిలువునా కాల్చేస్తాయ్! జాబితాలో కొత్తగా చేరింది "బిల్లు మంటలు"

*పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి రోజు విభజన బిల్ అసెంబ్లీ లో ప్రవేశపెట్టిన స్పీకర్ : (Madhavi Vemulapati)
అంత జ్ఞాన సంపద ఉందా ఆ బుర్రల్లో! ఎవరి దినాలు వాళ్ళు లెక్కెట్టుకుంటున్నారు..చాచి చెంపకాయ కొట్టమన్నాడు మొన్నాయనెవరో. ఇప్పుడది మన (అ)గౌరవ సభ్యులందరికీ వర్తిస్తుంది. (my comment)

*మీడియాకు కళ్ళెం వేసే శక్తి ఒక్క కోర్టుకే ఉంది ప్రస్తుతానికి..బెదిరింపుల్లో, మామూళ్ళలో వాళ్ళని మించిపోయారని పోలీసులూ భయపడుతున్నారు మీడియా అంటే..

*350 మంది సభ్యుల ఉభయ సభలకు.. 3500 మంది పోలీసులతో బందో బస్తు.. జరగని సభకు అధిక బందోబస్తు అని చెప్పిందందుకే!    

*నేనెప్పుడో చెప్పాను. రాష్ట్రంలో రాజకీయం, పాత్రికేయం అంటకగుతున్నాయని. చూసారా ఇవ్వాల అసెంబ్లీ, కౌన్సిల్లో సభ్యుల తోపులటలు, దుర్భాషలు. సిగ్గు పడవలసింది వాళ్ళు కాదు, మనం. వీళ్ళా మన ప్రతినిధులు అని. మీడీయా అగ్నికి ఆజ్యం పోస్తున్నదని అర్ధమయింది కదా!! మీడీయా వాళ్ళు కూడా రెండు వర్గాలై వాగ్వివాదాలు. సభ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందరూ కలసి. రాష్ట్రపతి కార్యాలయం నుంచి వచ్చిన బిల్లు ప్రతులకు భంగపాటు. పట్టపగలు చట్ట సభాప్రాగణాల్లో ప్రతినిధులు ప్రతులను చించడం ప్రాజాస్వామ్యానికి వస్త్రాపహరణమే! అసెంబ్లీ పరిధిలో కట్టడి చేయాల్సింది, ప్రాంగనం నుంచి బహిష్కరించాల్సింది ఎమ్మీల్యేలు, ఎమ్మెల్సీలను కాదు, మొదట మీడియాను. సభలోకంటే బయటే రభస ఎక్కువ..

*సమస్య పరిష్కారం కంటే ప్రజా ప్రతినిధులకు ప్రచార యావే ఎక్కువ. చానళ్ళుంటే రెచ్చిపోతారు, లేకుంటే చప్పబడతారు. ఏ రాష్ట్రంలో లేని దౌర్భాగ్యం మనదగ్గరే! ప్రతినిధుల స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం విశృంఖల విహారం చేస్తున్నాయి.

15-12-13
*ఉక్కుమనుషులున్న దేశం మొక్కవోలేదు..  పిల్లా - జెల్లా, పల్లె - పట్టణం.... ఆడ మగా..ఒకరు కాదు అందరూ... ఇవ్వాళ దేశం మొత్తం ఐక్యతా పరుగు పెట్టింది..

*మాజీ ముఖ్యమంత్రి, తాజా ముఖ్యమంత్రి సొంతజిల్లాలో వీరప్పన్‌ల(నేరస్థుల) స్వైరవిహారం. ప్రభుత్వ సిబ్బందిపై హత్యాకాండ.. ఇదీ శాంతిభద్రతల తీరు.
*రాష్ట్రాన్ని కలసి ఉంచితే, తనతో కలిసొస్తే.. బిజెపికి జగన్ 23 లోక్ సభసీట్లు ఇస్తానన్నాడట!(ఇదొక పైత్యకారి రాత-కూత)! తెలుగు విశ్లేషకుల మాదిరి బిజెపి అంత దిగజారి పోయిందన్నమాట. ఆ చేత్తోనే కాంగ్రెస్ కూ 18 ఇస్తేసరి. తనసీటు మాత్రం ఉంచుకుని.

*బాబుకు, జగన్‌కు, కెసీఅర్‌కు ఏకైక ఆపద్బంధు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే! ఖర్మకాలితే కాంగ్రెస్ జగన్‌కు, బిజెపికి కూడా మద్దతు ఇస్తుంది.. డిల్లీలో "పొరక" పార్టీకి ఇచ్చినట్లు.
జనసంఘ్ వ్యవస్థాపక ఆత్మలు శాంతించుగాక!!

*వాపు - బలుపు కాదు. అధికార, ధన మదాహంకారం తలకెక్కితే ఇక అధఃపాతాళానికే!! ముఖ్యంగా రాజకీయాల్లో ఇది నిత్య సత్యం..

*మార్కెట్ లో ప్రతి విక్రయానికి "బిల్లు" ఉంటుంది. కౌంట్లు.. డిస్కౌంట్లు, పర్సెంటేజీలలోనే తేడా!!

* బాపు - "గుండె" అంతర్ధానమయినా వడి వడిగా నడుస్తున్న కొండ. తెలుగులో రెండక్షరాల రేఖా బ్రహ్మ. దృశ్యకావ్యం, ప్రబంధకం, పురాణం, ఇతిహాసం, చరిత్ర...కలగలిపిన హంగుల రంగుల కాన్వాస్!
పిడుగు లాంటి బుడుగు నుంచి కల్పవృక్ష కవిసమ్రాట్ విశ్వనాథ వరకు చిరపరిచితమై, హాస్యానికి పుట్టినిల్లయిన తెలుగునాట ఆయనను గురించి మాట్లాడి పరిచయం చేయడం ఎంత దుస్సాహసమంటే.. అర్జా జనర్ధనరావుకు ఆంజనేయుని గురించి చెప్పడమే.  అసేతు హిమాచలం ఆ "రేఖా బ్రహ్మ" అశీతి ఉత్సవం జరుపుకుంటూ, పొట్ట చెక్కలయ్యేలా తెలుగులో పగలబడి నవ్వుతున్నదీనాడు.

14-12-13

*రాజకీయాల్లో ఎవరూ శాశ్వత శత్రువులుండరు. ఇది అక్షరాల నిజం. జనమే వెర్రిబాగులోళ్ళు.  బిజెపిని అటు జగన్, ఇటు బాబు తూర్పారబట్టారు. జగన్ ను కాంగ్రెస్, కాంగ్రెస్ ను జగన్ ఒకరి నొకరు రెండున్నరేళ్ళుగా తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టుకున్నారు. బిజెపి మతతత్వ పార్టీ అని బాబు విమర్శించారు, పొత్తు ప్రశ్నే లేదన్నారు.  ఇప్పుడు అవసరాలు మనుషులను మార్చాయి. బాబేమో బిజెపి వెంట సుళ్ళు తిరగడం.                
రాజశేఖరరెడ్డి  ఏదైనా స్వయంగా చూసుకున్నారు. ఏ సహాయానికి ఎవరి  వెంటపడలేదు.  కాంగ్రెస్ కు బద్ధశత్రువులైన విపక్షనేతలందరిని దూరంగా పెట్టారు. ఆయన కొడుకు జగనేమో అదే విపక్షనేతల దగ్గరకు కాలికి బలపం కట్టుకుని రోజూ దేశమంతా ఎక్కే గడప, దిగే గడప..యుపీఎకు మద్దతిస్తానన్న జగన్ ఎన్‌డీఎ కూటమి నాయకుల చుట్టూ ప్రదక్షిణలు.. ఇద్దరు బద్ధశత్రువులకు (జగన్-బాబు) కామన్ ఫ్రెండ్ బిజెపి. అదెలా సాధ్యం. రేపు బాబు-జగన్ కలవరని గ్యారంటీ ఏమీ లేదు..

*కాంగ్రెస్ చరిత్రలో నేను చూసినంతవరకు..మనరాష్ట్రంలో నిన్న, మొన్న దిగ్గీ పర్యటన అంత పేలవంగా ఏ కేంద్రనాయకుని పర్యటన జరగలేదు. డిల్లీనుంచి విమానం వచ్చి మళ్ళీ ఎగిరేవరకు సిఎం, సిఎల్పీ నేత, పిసిసి అధ్యక్షుడు, వందిమాగధ బృందం అనుక్షణం వెంట ఉండేది. వైఎస్సార్ హయాం 10 సంవత్సరాలలో అంతటా ఆయనదీ, ఆయన సైన్యానిదే హవా. ఈసారి పార్టీ నేతలది తలోదారి..పిసిసి అధ్యక్షుడు లేకుండా దిగ్గి గాంధిభవన్ సందర్శన, ముఖ్యమంత్రి అసలు లేక్కే చేయలేదు. సీమాంద్ర మంత్రులు తొంగిచూడలేదు.. ఒక్క సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ కలికం వేసిచూసినా కనబడలేదు. అనతా చానళ్ళ గందరగోళం మినహా శూన్యం. అంతా డ్రాఫ్ట్ బిల్లు మీదే జరిగిపోయింది..

**అంటే గతంలో బాబుగారు చేసినట్లా!! ఒకటిమాత్రం ఖాయం. మిగిలినోళ్ళ సంగతి తెలీదుకాని "గళంలో గరళం నిపుకోనిదే కలం కదలని మా పాత్రికేయులం" మాత్రం పూర్తిగా వ్యతిరేకిస్తామని జోస్యం చెప్పగలను.  
13-12-13
*నేనొక ఆఫరిస్తా!! ఆలోచించుకో!!~
ఉద్యోగం మానేసి రాజకీయాల్లో చేరి కనీసం ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ అయితే అయిదేళ్ళపాటు పనిలేకుండా ఏకబిగిన సెలవులు..జీతాలు, భత్యాలు, వసతి సౌకర్యం, పర్సెంటేజీలు, కాంట్రాక్టులు, అమ్యామ్యాలు, ఫ్రీ కరెంటు, నీళ్ళు, ఫోన్, ప్రయాణాలు, ఇళ్ళ స్థలాలు, బంగళాలు, కారు లోన్లు... ఇలా ఎన్నెన్నో ఉంటాయి. బాగా ఆలోచించుకో..  బలే మంచి చౌక బేరము.. ఇంకా ఉంది లిస్టు: విదేశీయానాలు, కమిటీల పర్యటనలు, ఖరీదైన స్టార్ హాస్పిటళ్ళలో  పెద్దాపరేషన్లు, జీవిత కాల పెన్షన్లు, పట్టుపరిశ్రమ ఉంటే వారసులకు సీటు,... చివరాఖరిగా పోతే(?) అధికార లాంచనాలతో అంత్యక్రియలు. నియోజకవర్గంలో శిలావిగ్రహం.. కనీసం ఒక చెత్తరోడ్డుకైనా పేరు..

*ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా !! యథా లోక్‌సభా.. తథా అసెంబ్లీ!!  రెండూ సోమవారమే కలుస్తాయి మళ్ళీ వాయిదా పడేందుకు..

*ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు.. శాసన సభాప్రాంగణ రణగొణ విశేషాలు. క్లుప్తంగా:
----------------------------------------------------------------------------------------------------
*గాంధిభవన్లో కండువాలతొ దిగ్గిరాజాకి కార్యకర్తలు, నాయకుల ఊపిరాడని ఆహ్వానం -- జాగ్రత్త అవి మెడకు బిగుసుకునే ప్రమాదముంది.

*మూడేళ్ళపాటు తెలంగాణాపై తీర్మానానికి శాసన సభ స్తభన. ఇప్పుడా సీను మారింది. సమైక్యాంధ్ర తీర్మానానికి సభ స్తంభన. ఫలితం శూన్యమే!

*ప్రొఫెసర్ కోదండరామ్‌ను సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు రాజీనామాచేసి ఉద్యమంలోకి రావాలని మూడేళ్ళు ఆక్షేపించారు. వారే స్వయాన ఇప్పుడు ఒక ఎంజీవో ను (అశోక్ బాబు) గుమాస్తాను ప్రోత్సహిస్తూ అతని వెనుక నక్కి నాటకాలాడుతున్నారు.

*శాసనసభ, మండలి ప్రాంగణాలు నాతకీయ ఫక్కీ ఏడుపులు, పెడబొబ్బలతో స్మశానాన్ని మరపిస్తున్నాయి. - నిజం, ప్రజాస్వామ్యం పట్టపగలే హతమయింది..

*కేంద్రం అపంపిన ముసాయిదా ఎంత చులకనైంది. ముఖ్యమంత్రే స్వయంగా అవహేళన చేశారు: బిల్లు విమానంలో ఎంత స్పీడుగా వచ్చిందో అంత స్పీడుగా వెనక్కి పంపుదాం. మంగళయాన్‌లా! అది చేరడానికి ఆరునెలలు పడుతుంది.  
శాసన సభ, మండలి వదలి మీడియా పాయింట్లవద్ద గొంతులు  చించుకోవడానికి మంత్రులకు ఏమీ అనిపించడంలేదేమో కాని చూసేందుకే సిగ్గనిపిస్తోంది.

*విభజన బిల్లులో చాలా తప్పులున్నాయట- ముఖ్యమంత్రిగారు చెప్పారు.

*ముసాయీదా బిల్లు నకళ్ళు 390 ఇంగ్లీషు, తెలుగు, ఉర్దూ ప్రతులు సిఎస్‌కు చేరాయని నిన్నంతా చానళ్ళు ఒకటే రొద.. ఇవ్వాళేమో భాషాపరమైన సంస్య వచ్చిందని, తెలుగు-ఉర్దూ కాపీలు రాలేదని రచ్చ, రచ్చ. ముందేమో అయిదు బండిళ్ళని హంగామా.. అర్ధరాత్రేమో 8 బండిళ్ళని సవరణలు.. అఘోరించినట్లుంది..
*సభ్యులందరూ మాట్లాడడానికి సభ ఏర్పాటవుతుంది. అంతా గోలగోల తో వాయిదాపై వాయిదా పడుతుంది. అప్పుడు సభ్యులందరూ విడివిడిగా, కలసికట్టుగా చేంబౌకెళ్ళి స్పీకర్‌ను కలుస్తారు. ఇదేమి చోద్యమో!!
*అసెంబ్లీకి వెళ్ళండర్రా అని చెప్పాల్సిన దిగ్గీ రాజా..పనికట్టుఇకుని మరీ వచ్చి సభ్యులను గుంపులుగా విడగొట్టి సమావేశాలనే నీరుగార్చారు.

*మంత్రులు, ఎమ్మెలయేలు ప్రాంతీయమ గావిడిపోయి సమాలోచనలు, వ్యూహ ప్రతివ్యూహాలు. మంత్రివర్గ సహచరులు  ముఖ్యమంత్రిని హెచ్చరించడం విడ్డూరం కదూ. అసలు సభ నడవడం సంగతి అలా ఉంచితే.. అసలు ప్రభుత్వం ఎక్కడున్నది?

*సౌండ్ పొల్యుషన్.. ఇక నుంచి ప్రతీ పార్టీ కి ఒకరే స్పోక్స్ పెర్సన్ ఉంటే బావుంటుంది..వీళ్ళ వాగుడికి చెవుల్లోంచి రక్తం వస్తుంది.
(రాచమళ్ళ పద్మజ వ్యాఖ్యకు నా స్పందన:)
**గంటల తరబడి స్పోకులు పెట్టి పొడుస్తుంటే మరి చెవులనుంచి రక్తపాతమేగా.. స్విచ్ ఆఫ్ చేసుకునే వీలున్న మీరే అలా అనుకుంటే బతుకు మెతుకు కోసం పారిపోయే దారికూడా లేని మాగతి ఏమిటి.. రోజూ..

*బాబు గారు చెప్పింది నాకూ నిజమేననిపిస్తున్నది. తెలంగాణ ముస్సాయిదా బిల్లు పోస్టులో లేటవుతుందనుకుంతే.. ఆ కట్టలన్నింటినీ డిటిడిసి కాని, ఏ ఎన్ ఎల్ కొరియర్ సర్వీసులో పంపితే పోయేది కదా! తొందరేముంది, సి ఎం ఇప్పుడే ఏమీ తేల్చరు కదా! "టి" తయారీకి ఇదొక అదనపు ఖర్చు..  రాష్ట్రం అసలే ఆర్థికంగా  క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.

*గంట మోగించాడు. పార్టీ ఫిరాయింపుకోసం. నేచెప్పానా.. మంత్రులు, మాజీలు, తాజాలు, ఎంపీలు జగన్ శిబిరంలోకి క్యూ కడతారని.
మొదట్లోనే వై ఎస్ వివేకానంద, ఆ తరువాత వరుస..ఒక మోపిదేవి, అ-ధర్మాన, ఒక ఘంటా, (ఆయన వెంట మరో అరడజనంట..)చీమ మంత్రులు ఎలాగూ చక్కెరదగ్గరకేగా.. అతీత శక్తి రంగప్రవేశం. ఇక చూడండి..
జండా మార్చిన మెగా నాయకుడు కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రి.. భృత్యుగణమేమో వైఎస్సార్సిపి.. ఒటేసిన జనమేమో గంగలోకి.. ఇది మన రాష్ట్ర రాజకీయ విలువ..
ఖైదీకన్నయ్య సినిమాలో ఒక పాటుంది: కొట్టిన చెయ్యే కోరు..
దాన్ని మనం ఇలా పాడదాం: తిట్టిన నోరే పొగుడు..

*Be good at heart. It purifies blood. Faith flows in it. It gives good health.. Health is WEALTH.

*ఎక్కువ మంది వద్దనుకున్నా (నోటా)తక్కువ ఓట్లు వచ్చినోడే  మనకు నచ్చినోడు అవుతాడు.. వాడు ఎంత సచ్చినోడైనా సరే!! .

*ఇది ఇంటింటి భాగోతం:
---------------------------
మనం ఆరోగ్యంగా ఉన్నా మన వాళ్ళ తృప్తికోసం కొంత పెనాలిటీ చెల్లించుకోక తప్పదు. ఇంట్లో వాళ్ళ భయం నివృత్తిచేయడానికి డాక్టరు దగ్గరకు వెళతాం. వాళ్ళ సమక్షంలో మరింత భయం పెంచుతూ (తన ఫీజు మాడరేట్ గా..250రూపాయలు పిండి) కనీసం ఓ అరడజను పరీక్షలు రాస్తాడా పెద్ద మనిషి.
ఇక తప్పదు డయాగ్నోసిస్ లేబోరేటరీకి. అక్కడ అధమం 2 వేల రూపాయలు "హుండి"లో సమర్పించు కోవాలి. పరీక్షలన్నీ అయిపోతయ్. "అంతా నార్మల్" అని తేలుస్తారు. మళ్ళీ ఆ కాగితాలు పుచ్చుకుని డాక్టరు దగ్గరికెళితే.. అన్నీ అటూ ఇటూ చూసి, "యు ఆర్ ఆల్ రైట్. నథింగ్ సీరియస్. వయసు పైబడింది కదా.. సీజనూ మారింది, దాని ఎఫెక్ట్. కాని ముందు జాగ్రత్తగా ఈ మందులు కనీసం మూడు నెలలు వాడండి. ఆశ్రద్ధ చేయద్దు" అని సూక్తిముక్తావళి వినిపించి ఒక జాబితా చేతిలో పెడతాడు.. మళ్ళీ ఫీసు వసూలు షరా మామూలే.
ఆ మందులకు ఒక వెయ్యి రూపాయలు ఖర్చు."నే చెబితే విన్నారా? నాకు ఏమీలేదంటే, మూడువేల రూపాయలు ఆముదం" అని మనం అంటాం. "పోతే పొయింది వెధవ డబ్బు, మీ కంటే ఎక్కువా? ఏమీ లేదని తేలింది, అది చాలు", అని వాళ్ళు సంతోషిస్తారు.. ఇది ప్రతి ఇంటా భాగోతమే.. నాకు నిన్న, మొన్నట్లో ఇలా 3 వేల రూపాయలు చిలుమొదిలింది. నా భార్య, కూతురు మాత్రం హ్యాపీగా ఉన్నారు.

12-12-13
*దిగ్గి సూట్ కేస్ తెచ్చాడా? తీసుకెళతాడా? డిల్లీలో వాళ్ళకి, ఇక్కడివాళ్ళకు మంచిగా నిద్రవస్తుంది. ఎటూ నిద్ర రానిది, పోనీయంది తెలుగు చానళ్ళే.. ఈ మధ్య రాష్ట్రంలో కనబడకుండా పోయిన ఒక గొప్ప సోల్ సాక్షాత్కారమైంది ఇవ్వాళ దిగ్గీ తో!!

*విలేఖరులకు ఏదైనా గ్లోబల్ ప్రైజు పెడితే అది తప్పకుండా హైదరాబాద్ టిడిపి బీట్ విలేఖరులకే ఇవ్వాలి.  నాకు తెలిసి, నేను చూసినంతవరకు.. టీవీ చానళ్ళలో రోజూ లైవ్ లో కనబడడం, గంతలతరబడి విలేఖరులను వాయించడం - మహా శక్తిమంతుడైన చంద్రబాబు గారికే సాధ్యమైంది. టిడిపి బీట్ విలేఖరుల  బ్రెయిన్  తాటలు ఎప్పుడో ఊడిపోయాయి. జర్నలిస్టులకు అందుకేనేమో ప్రభుత్వ భాగస్వామ్యంతో గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం ప్రవేశపెట్టారు..

*తెలంగాణా డ్రాఫ్ట్ బిల్లు పై ఉదయం నుంచి తెలుగు చానళ్ళు ఇష్టా రాజ్యంగా చెప్పుకుంటూ వచ్చాయి. నిజానికి బిల్లు ప్రతి సచివాలయానికి చెరింది(6.30 నిమిషాలు-సాయంత్రం) అరగంట కాలెదు. అయిదు బండిళ్ళలో బిల్లు అన్నారు. బండిళ్ళు లెక్కబెడితే ఎనిమిది ఉన్నాయి.. ఎవరి వార్తలు వారి ఇష్టారాజ్యం..వాస్తవాలకు రంగు పులుముతున్నాయి..

*ఆర్నెల్లలో ఎన్నికలొస్తున్నాయ్.. నాయకులు గోడలు దూకడం, రంగులు మార్చడం, కులాల మీటింగులు, రిజర్వేషన్లు, ఉద్యోగ సంఘాల బెదరింపులు, భజన మండళ్ళు అన్నీ షరా మామూలే. విశ్లేష"కుల" సమావేశాలు, కొత్త పత్రికలు పెట్టడం, చిన్న చానళ్ళు పుట్టడం, సీట్లకోసం ఎన్ని పాట్లో!!  వినోద భరితమే కాదు ఆదాయ మార్గం కూడా..  

* మండేలా మరణం ఏ పి అసెంబ్లీకి ఒక పూట ప్రాణం పోసింది..సభ గంభీరంగా సాగింది. పాపం ఆయనెవరో అసలు తెలీని వారుకూడా కక్షలు లేకుండా కలసికట్టుగా అంతా (రాసుకొచ్చిన)(రాసిపెట్టిన) నివాళులర్పించారు...

No comments:

Post a Comment