Monday 30 December 2013

రోతను పాతరేద్దాం...
పాతకు పట్టం కడదాం...
కొత్తను నెత్తికెత్తుదాం...
మంచిని ఎంచుకుందాం...
మనసును పంచుకుందాం... 

31-12-13
ఇది పాత సీసాలో పాత సారానే.. అర్ధరాత్రినుంచి కొత్త సరుకు..ఫుల్ జోష్!!
-------------------------------------------------------------------------------------

*తొందరపడి ఒక కోయిలా, ముందే కూసింది, నేలకు ఒరిగింది..--అమేథీలో రాహుల్ పై పోటీ చేస్తా! ధైర్యం ఉంటే మోడీ కూడా బరిలోకి దిగాలి--ఆప్(అతి) విశ్వాస్
*ఎన్నికల వేళ ఎన్నెన్ని కళలో!-- రాష్ట్రంలో 32 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్-కొలువుల మేలా!
*ఎక్కడబట్టినా అవినీతి కక్కులే--- రాజకీయనాయకులకు తిన్నదరగని అజీర్తి రోగం
*యథా రాజా తథా ప్రజా
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం అసంబద్ధం -- విభజనపై ముఖ్యమంత్రి.
ప్రభుత్వాస్పత్రులలో మాకు వైద్యమా.. మేమొప్పుకోం ఉద్యోగులు!!
*మన ఘన నగరపాలక సంస్థ మొద్దు నిద్రకు తార్కాణం. -- అనుమతులు లేకుండా పదేళ్ళుగా నగరంలో వేల సెల్ టవర్లు
*ఏపి చాయ్ వాలాలతో మోడీ ముఖాముఖి -- కొంచెం అలోచించండి సార్, ..బార్ వాలాలతో మరీ బాగుంటుందేమో!!!
*మళ్ళీ డిల్లీ విమానాలకు రద్దీ - రాష్ట్రపతి నేడు డిల్లీ తిరుగు ప్రయానం.
*రాష్ట్ర ప్రజాలారా రెండ్రోజుల్లో ప్రాణాలు ఇన్సూర్ చేయించుకోండి-- బొత్స సత్తెయ్య నిజంగా 3న ఆస్తులు ప్రకటిస్తారట!!
*మందు ఉప్పెనలో మునిగిన భాగ్యనగరం - డిల్లీలో కుళాయిల్లో కట్టలు తెంచుకున్న "ఆప్" నీటి పరవళ్ళు..

29-12-13

*వాటికన్ సిటి మాదిరి తిరుపతికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి: .!! ఆ విషయంలో మాత్రం, బాబే కరెక్ట్. అదే వై ఎస్ ఉండి ఉన్నట్లయితే ఏడుకొండలు రెండుకొండలై మిగిలినదంతా నిజంగా వాటికన్ సిటి అయ్యుండేది.. అందుకే బాబు బతికి బట్టకట్టాడు.  
*బలాఢ్యులు, ధనాఢ్యులు, గుణాఢ్యులు... అదొక పాత కేటగిరి!! కులాఢ్యులు, మదాఢ్యులు .. ఇది కొత్త కిరికిరి.
*ఉద్యోగులకు హెల్త్ కార్డులు.. రాజకీయ నాయకులకు వెల్త్ కార్డులు.. ఈ స్కీమేదో బాగుంది కదా!!
*తడిగుడ్డతో గొంతు కొయ్యడం కాంగ్రెస్ కు అలవాటట....ఉండవల్లి గారికి 10 ఏళ్ళ ఎంపి అనుభవంతో జ్ఞానోదయమైంది ఈ రోజు:
మరి పదేళ్ళుగా మనమెన్ని గొంతులు కోసామో అక్కడ ఉండి? ఇప్పుడు అనుభవం తలపండి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన రొమ్మును సమైక్య కత్తితో కోస్తున్నారు..
*మీరు మరొక విషయం గమనించారా!! ఆంధ్రా ఆక్టోపస్ (లగడపాటి) మరొక జోస్యం చెప్పింది - జగన్ కాంగ్రెస్ లో చేరే కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య సత్తిబాబు చెప్పినట్లు 30 మంది కాదట. 70 మందట..కేంద్ర మంత్రు కూడా ఇద్దరున్నారట ఆ జాబితాలో: కొంపదీసి బొత్స ఝాన్సీ కూడా ఉందో ఏమిటో??  
*వివేక్, మందా గులాబి దండులో జేరి కెసీఅర్ పక్కనే కూర్చుని సిఎమ్‌ను తూర్పారబట్టారు. అయినా వారు కాంగ్రెస్ ఎంపీలే! కాంగ్రెస్ కు అంటూ.. ముట్టూ ఉండదు..
*గౌడ్ గారు ప్రాయశ్చిత్త పరిహారార్ధం అందుకే మళ్ళీ కంచిగరుడ సేవ మొదలెట్టారు..
*ఒకే వొరలో ఎన్ని కత్తులో! ఒకే వేదికపై ఎన్ని కుత్తుకలో!! ఉండవల్లి, లగడపాటి, సబ్బం---హర్షకుమార్, కావూరి, రాయపాటి..ఇదెలా సాధ్యం?
వీరి సమన్వయ కర్త ఎపి జ(ఎ)ర్నలిస్టుల ఫోరం..
*ధనముంటే ఏ సభకైనా జనమొస్తారు.... కావాలంటే చూడండి చిత్తూరు జిల్లాలోనే ఒక వైపు జగన్, మరొక వైపు బాబు..... అబ్బబ్బ ఇసకేస్తే రాలడం లేదు..విసుగేసినా ఆగడం లేదు..
*నిజమే! అమ్మ పెట్టదు..అడుక్కు తినమంటుంది... అది అమ్మ ఆద్మీ పార్టీ..  
*టీడీపీ ప్రజాగర్జనకు నన్ను ఆహ్వానించలేదు: హరికృష్ణ----గర్జనలకు జవసత్వాలుడిగిన వృద్ధ (వృధా) సింహాలను పిలవరు..
26-12-13

*మాతృభావం, పితృభావం, గురుభావం, సోదరభావం, స్నేహభావం, గౌరవభావం... ఇవన్నీ వాంఛనీయమే కాని అహంభావం మాత్రం అవాంఛనీయం....
*శ్రీకారం, స్వీకారం, మమకారం, ఉపకారం,అపకారం, తిరస్కారం, నమస్కారం, పురస్కారం, ఓంకారం, ... ఏవైనా భరిచవచ్చు. కానీ అహంకారులను అర క్షణం కూడా సహించకూడదు..
*We can bear cheating.. we can spare deceiving.. but we should not tolerate betraying.
*short cuts in life cut short life.. be careful !
*Influence may workout some times..be careful, it is highly inflammable all times.
20-12-13

*ప్రధాని పదవికి పోటీలో జయలలిత!! --- దక్షిణంలో మగాళ్ళకు చేతకాని పని. ఒక మహిళ అలా ధైర్యం చేస్తున్నందుకు. చాలా గర్వించదగిన విషయం. దక్షిణ సామ్రాజ్ఞి.

19-12-13

*ఇవ్వాళ రాష్ట్రం విడిపోవడానికి అందరూ ఎలా అంగీకరించడంలేదో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు, కలవడానికి కూడా అందరూ అంగీకరించలేదు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు 1955 నవంబరు 29వ తేదీ హైదరాబాద్ అసెంబ్లీలో ప్రకటన చేస్తూ.. ఇలా చెప్పారు:  
"విభజనానంతరం హైదరాబాద్ భవిష్యత్తు నిర్ణయాధికారం పార్లమెంటుదే. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం సిఫారసులపై ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని తీర్మానం రూపొందించారు. దానిలో లోపాలోపాలు నాకు తెలుసు. సభలోని అన్ని వర్గాలను తీర్మానం సంతృప్తి కలిగించలేదనీ నాకు తెలుసు. నోటీసుపై వచ్చిన రెండు డజన్ల సవరణలు  ఈవిషయం తెలియజేస్తున్నాయి.
కర్ణాటక, సంయుక్త మహారాష్ట్రం ఏర్పాటు విషయంలో కూడా అభిప్రాయ బేధాలున్నాయి. తెలంగాణలో మూడురకాల అభిప్రాయాలున్నాయి. ఆ మూడూ:
తక్షణ విశాలాంధ్ర నిర్మాణానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యవర్గం సలహా పాటించాలి.
శాశ్వతంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యాలి.
ఎస్సార్సీ సిఫారసులను ఆమోదించడమే మంచిది.
సభ్యుల అభిప్రాయం భారత ప్రభుత్వానికి తెలియజేస్తాం. వ్యవధి లేనందువల్ల చర్చలో పాల్గొనే అవకాశం లభించని సభ్యుల లిఖిత పూర్వక అభిప్రాయాలను అంగీకరించడమా? లేకపోవడమా? అనేది సభాపతి నిర్ణయం. ఏది ఏమైనా ఈ విషయమై తుది నిర్ణయం చేసే అధికారం పార్లమెంటుదే!!" 

No comments:

Post a Comment