Sunday 2 February 2014

రుచులు మారుతున్న రాజకీయం..

పులిహోర నాకిష్టం.. నా గోల నాదే (వ్యాఖ్యలు)


 




1-2-14
*ఎన్నికలప్పుడు గోడలు దూకడం, కొత్త రంగులు పూసుకోవడం, పాత రంకులు బయటపెట్టడం.. మన దేశంలో కొత్త కాదుగా! పేదరికం, అవినీతి నిర్మూలన, ప్రజాసేవతో పాపం (అరాచక)రాజకీయ హృదయాలు పరితపిస్తుంటాయి.  ప్రజలు మినహా ఆకలి, అలసట, నిద్రా ఏవీ ఉండవు..

*కారత్ గారు చెప్పిన తరువాత నాకివ్వాళే తెలిసింది సెక్యులరిస్టులంటే ఎవరో!!. —

*మోడీని మెచ్చుకుంటే- మతతత్వ వాది, మన్మోహన్‌ను పొగిడితే-అసమర్థుడు, రాహుల్‌ను నచ్చితే-మొద్దబ్బాయ్, కేజ్రీను సెభాష్ అంటే-శుంఠ, బాబును భేష్ అంటే-కులగజ్జి, జగన్ జై అంటే-అవినీతిపరుడు, బాబాలకు నమస్కరిస్తే-శృంగారపురుషులు, ...పోనీ దేవుడికి దణ్ణం పెట్టినా- అదీ సహించలేరు..
లోకో భిన్నరుచి.. తా మునిగిందే గంగ... ఇదీ వ్యక్తుల వరుస!!

31-`1-14
**డిల్లీ లో కేజ్రీ 'వాల్' పోస్టర్ అతికించాడు. అత్యంత అవినీతిపరుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్క పేరు .. వై ఎస్ జగన్...

*What had happened to Tarun Tejpal of Tehelka? Digging facts or his own grave..

30-1-2014
*తలపై అయిదు లక్షల రూపాయల రివార్డు ఉన్న 15 సంవత్సరాల అజ్ఞాత వాస మావోయిస్టు కిసా నర్సింహులు ఎలియాస్ జాని నేటి సాయంత్రం డిజిపి కార్యాలయంలో నేరుగా లొంగి పోయాడ ట!!!!
పోలీసు స్టేషనులోనికి వెళ్ళాలన్నా, కమిషనరు కార్యాలయంలోకి వెళ్ళాలన్నా..సామాన్య పౌరులకు అనుమతి ఉండదు. తిరస్కారాలు. లక్ష యక్ష ప్రశ్నలు.. దోపిడిదారులు, హంతకులు, తీవ్రవాదులకు నేరుగా డిజిపి కార్యాలయంలోకి ప్రవేశం లభిస్తుంది.. వెంటనే చట్టం కట్టుదిట్టమైన "భద్రత" కూడా కల్పిస్తుంది.

*పాపం మహాత్ముడు.. ఆయనను ఇవ్వాళ తలుచుకున్న పాపాన పొలేదు అసెంబ్లీ పుణ్యమా అని!!

*The voice vote, or acclamation, is considered the simplest and quickest of voting methods used by deliberative assemblies. The presiding officer or chair of the assembly will put the question to the assembly, asking first for all those in favor of the motion to indicate so verbally ("aye" or "yes"), and then ask second all those opposed to the motion to indicate so verbally ("no"). The chair will then make an estimate of the count on each side and state what he or she believes the result to be. Voice votes are usually not recorded.

*అసెంబ్లీలో జరిగింది ఓటింగ్ కాదు. టింగు..టింగు. అది మూజువాణి కాదు.. మూగవాణి.. గుడ్డికన్ను మూస్తే ఎంత తెరిస్తే ఎంత? కె సి ఆర్ గతంలో చెప్పినట్లు ఇప్పుడు ఆప్షన్ కిరణ్ దే- చాట్‌భాండారా? టిఫిన్ సెంటరా?
*ఇన్నాళ్ళు బట్టలు లేని ద్రౌపదితో సరసాలాడి, నగ్న సౌందర్యాన్ని కన్నులారా తిలకించి.. తలలు ఒంచుకుని చేతకాక సిగ్గేసి చివరకు బట్టలు లేవని తెలుసుకున్న గాంధారులు. ఇప్పటికీ కేంద్రానిదే అధికారం. అది తెలుసుకోలేని అంధత్వం వీళ్ళను ఆవరించింది.  రాజ్యాంగం పేర్కొన్న ధర్మంలో అసెంబ్లీకి ఎటువంటి హక్కు లేదు. పార్లమెంటే సర్వసత్తాధికారి.. అది అందరికీ తెలుసు. ప్రజలను మభ్యపెట్తేందుకే ఇంత వ్యవహారం. ముఖ్యమంత్రి నాటకమాడకుండా నిజంగా వ్యతిరేకించి ఉన్నట్లయితే ముసాయిదా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం కోసం పమిపిన రోజునే తమ వ్యతిరేకతను ప్రకటించి రాజీనామా చేసి ఉండవలసింది.

*Yes. Democracy was once again ridiculed.. నిండుసభలో మరోసారి రాష్ట్రపతి పంపిన బిల్లుకు దుశ్శాసనపర్వం..(వస్త్రాపహరణం..)
*I did not see whether Mahatma was assassinated by Nathooram Godse. But AP Assembly members are trying to do the same on his 66th death anniversary ..

*రాజ్యాంగం పేర్కొన్న ధర్మంలో అసెంబ్లీకి ఎటువంటి హక్కు లేదు. పార్లమెంటే సర్వసత్తాధికారి.. అది అందరికీ తెలుసు. ప్రజలను మభ్యపెట్తేందుకే ఇంత వ్యవహారం. ముఖ్యమంత్రి నాటకమాడకుండా నిజంగా వ్యతిరేకించి ఉన్నట్లయితే ముసాయిదా బిల్లును రాష్ట్రపతి అసెంబ్లీ అభిప్రాయం కోసం పమిపిన రోజునే తమ వ్యతిరేకతను ప్రకటించి రాజీనామా చేసి ఉండవలసింది.
*AP Legislative Assembly Speaker should have done this (restricting media -particularly electronic) three years back..

*For the first time( to the best of my knowledge) today media was not allowed into Assembly gallery..

28-1-14
*రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్ధిత్వాలపై ఊహాగానాలకు ఈ సారి ఎందుకో ఏ పత్రికా ఉత్సాహం చూపలేదు. విశ్లేషకులు పెదవి విప్పలేదంటే సర్దుకున్నట్లు "అర్థం" అయింది. అన్ని కథలూ టీడీపి పైనే కేంద్రీకృతం.. తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు నోట మాట కరవైంది. అందరూ రాజీ పడ్డారా??

*రాజ్య సభ టిక్కెట్లు కెవిపి, ఖాన్, సుబ్బిరామిరెడ్డి కి.. సమైక్య రాష్ట్రంకోసం రాజ్య సభ సభ్యత్వానికి రాజీ నా(డ్రా)మా చేసిన కెవిపి కి మళ్ళీ ఆరేళ్ళు పదవి. ఇది కాంగ్రెస్..  ఏపార్టీకేగినా ఎందుకాలిడినా పొగడరా నీతల్లి "ఇటలి మాతను".....మనం అన్నీ వదిలేస్తే.. అప్పుడు అన్నీ మనలను పట్టుకుంటాయి. ఇదీ రాజకీయ సూత్రం.
"ఆత్మ" లక్షణం అర్ధమయిందా ఇప్పటికైనా... దానికి ఏపాపాలూ సోకవు. ఇప్పుడర్ధమైందా ఆత్మ ఎందుకు శాశ్వతమో.. అందుకే అందరూ "ఆత్మ ప్రదక్షిణాలు"

*స్వార్థం కోరనిది స్నేహం. బంధాలు పటిష్టం చేసేది అనుబంధం. రాగాలను అతిశయింపజేసేది అనురాగం. జీవితము, ఈ "ముఖపుస్తకం" నాకు అటువంటి గొప్ప వరాలను ప్రసాదించిచాయి. ఎందరో ప్రేమమూర్తులు మిత్రులు, సోదరీ సోదరులయ్యారు. సహృదయులు, పెద్దలు, జ్ఞానుల సాంగత్యం లభించింది. చదువు, సంపద, అందం, కులం కొందరిని గర్వాంధులను చేస్తాయి. అటువంటి వారు తారస పడినా.. మేక వన్నె పులుల నిజ నైజాలు బహిర్గతమై దూరంగా జరిగి పోతారు. అదే వడపోత. వాళ్ళ ముఖాలు చూపలేక ఇతరుల ముఖాలకు ముసుగేస్తారు. అందులో ఆడ, మగ తేడాలేదు. ఈ సమాజంలో అటువంటి వాళ్ళు పిపీలకాలు. దేనికీ పనికిరారు. ఆ అనుభవమూ ఆర్జించాను. అది నాకు 'గుణపాఠం' కాదు. వాళ్ళ గణ, గుణాలు బయటపడ్డాయి.

25-1-14
*ఓటు మన చేతిలో పాశుపతాస్త్రం..ఎప్పుడు, ఎలా, ఎవరిమీద ప్రయోగించాలన్నది వారి వారి విచక్షణ జ్ఞానంపై ఆధారపడిఉంటుంది..తెలుసుకోవడం ధర్మం.. కాదంటే ఖర్మం!!

24-1-14
*ఫేస్ బుక్ పాతాళానికని పేపర్లలో కొత్త కథనం..రోజులు గడుపుకోవాలి, ప్రచారం సంపాదించుకోవాలి. ఆ పరిశోధనలు,, సమీక్షలూ అన్నీ పొట్టకూటికి, పేరు ప్రతిష్ఠలకు, ఫక్తు వ్యాపార లక్షణం. అదైనా కొత్త మోజు కొన్నాళ్లే.. గ్రామఫోన్లు పోయాయ్, రేడియోలు పోయాయ్, ట్రాన్సిస్టర్లు పోయాయ్, టీవీలు పోయాయ్, ఎల్సీడీలు పోతున్నాయ్, ల్యాండ్ లైన్లు పోయాయ్, పేజెర్లు పోయాయి, సెల్ ఫోన్లలో రోజుకోటి మాయం..కార్డులు, ఇన్లాండ్ పోస్టు, టెలిగ్రాం, ఈమెయిల్స్, ట్విట్టర్లు, ఓర్కాట్,.... పరిణామ సిద్ధాంతం.. తప్పదు..నాటకాలు లేవు, సినిమాలు మూత, ఇదీ మీడియా పిచ్చితనం. పుస్తకాలు పోయి, న్యూస్ పేపర్లు నెట్ చదువులోచ్చాయ్.  టైప్ రైటర్లు హుష్.. కంప్యూటర్లు వచ్చాయ్. అవీ రూపాంతరం.. ఏది శాశ్వతం. బతుకులే మర్నాటికి.....ఒక్క ఫేస్ బుక్ పై అంత సీరియస్సా!!

*అదేమిటి? చోద్యం. మొన్ననే కదా మీడియా మొత్తం డాన్స్ చేసింది.. దక్షిణ- ఉత్తర గ్రిడ్ అనుసంధానమయింది, ఇక దేశం మొత్తం వెలుగే వెలుగు రాష్ట్రంలో కరెంటే కరెంటు..... కోతలుండవ్, ఒద్దన్నా, స్విచ్ఆఫ్ చేసినా వైర్ల నుంచి ఓవర్‌ఫ్లో..అంటూ ఒకటే మోతపెట్టాయ్. --------------- మరోవైపేమో ఇవ్వాళే కోతల వాతలు మొదయ్యాయని ప్రభుత్వ ప్రకటన.. ఇకపై..
గ్రామాల్లో ఉదయం 6 ఆం నుండి సాయంత్రం 6 ఫం వరకు (12 గం); *మండల కేంద్రాల్లో ఉదయం 8 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు (6 గం);
మునిసిపాలిటీల పరిధిలో ఉదయం 6 నుండి 8 గంటల వరకు, మధ్యాహ్నం 12 గంటల నుండి 2 వరకు (4 గం); కార్పొరేషన్ పరిధిలో ఉదయం 9 గంటల నుండి 10.30 గంటల వరకు (1:30 గం)!!

22-1-14
*మూడేళ్ళతరువాత కూడా కిరణ్ అర్ధం కాలేదంటే అది మన (మీడియా) లోపం.. ఆయన ప్రతిభకు తార్కాణం..  నా అనుభవం బట్టి కేశవరావు, జానారెడ్డి, కిరణ్.. ముగ్గురూ మూడు విధాలు.
కేశవరావు మాట్లాడేది మనకే కాదు, ఆయనకూ అర్ధం కాదు. అందుకే మర్నాటి పత్రికల్లో ఎవరేవిధంగా రాసినా ప్రశ్నించడు. జానారెడ్డి ఏది తనకు ఎంత అవసరమో అంతవరకే అర్ధమయ్యేట్లు మాట్లాడతాడు. వొద్దనుకున్నప్పుడు అర్ధం కానట్లు మాట్లాడతాడు. కిరణ్ తనకు అర్ధమయింది మాట్లాడతాడు. ఎదుటివాడికి అర్ధమయిందా లేదా అయనకు అనవసరం..అవసరమనుకున్నవాడు అర్ధం చేసుకోవాలి.

*ఆశల ఊయలలో చివరి ఊపు.. బిల్లు గడువు పొడిగింపుపై ఊహాగాన వార్తలు..జాతీయ మీడియా పేరిట మన గొట్టాల్లో.. అయితే.. అదుగో మేము నిన్ననే చెప్పాం!! కాకుంటే.. ఇది కాంగ్రెస్ నీలి ప్రచారం.. ఒక రాయెయ్యడమేగా..----అదే జరిగింది చూశారా? అప్పుడే ఒక గొట్టంలో మరో కథ..పాతవార్తకు ఖండన. గడువు పొడిగింపు వార్త నిజం కాదని హోం వర్గాలు పేర్కొన్నట్లు.. ముం(మం)దు జాగ్రత్త..

*ఆత్మకథలు అందరికీ సాధ్యం కాదు. ఆత్మలు లేకుండా కథలు ఎలా నడుస్తాయి. అలా అని కథలున్న వాళ్ళకు ఆత్మలున్నట్లూ కాదు.. ఆత్మలు 'పవర్‌' ఫుల్..

21-1-14
*"మందులు ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే సునంద మరణం-----".. కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునందపుష్కర్ మందులను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్లే మరణించినట్లు పోస్ట్ మార్టం నివేదికలో పేర్కొన్నారు. నిద్రకు, ఆలోచనల నివారణకు ఉపకరించే  'ఆల్ప్రజోలం'  మందు అధిక మోతాదులో సునంద తీసుకున్నట్లు, అదే సమయంలో ఆమె రక్తంలో ఆల్కహాల్ తీసుకున్న ఆనవాళ్లేమీ కనిపించలేదనిల సమాచారం. --
మరి నిన్నటి దాకా అవేవో చించుకున్న ప్రసార మాధ్యమాలు నోరిప్పలేదే!! తమ కథలు, కాకరకాయలు, వాదననిలవలేదని అక్కసా? వాదననిలవలేదని అక్కసా? శీల విచ్ఛిత్తి ప్రక్రియ.. ఎవరికి వారే న్యాయమూర్తులై పోయారు.. వైఎస్సార్ ఎప్పుడూ అసెంబ్లీలో చెబుతుండేవారు: "రాజకీయం ఎలా తయారైందంటే...గుడ్డకాల్చి ఎదుటివాని ముఖాన వేసి మసి నువ్వే తుడుచుకో, నలుపు కాదని నిరూపించుకో.. అన్నట్లు. " అని .

*ఈ నెల 16వతేదీ డిల్లీలో ఏ.ఐ.సి.సి.సమావేశాల మొదటి రోజున "టి-బిల్లు చర్చకు రాష్ట్రపతి మరో పది రోజుల సమయం పోడిగించనున్నట్లు" పి.టి.ఐ. వార్తాకథనం పేరిట మీడియాలో బహుళ ప్రచారం జరిగింది. 17వ తేదీ అన్ని పత్రికలదీ అదే పతాకశీర్షిక.. ఆరు రోజులయిందికదా! మరెందుకు ఆ వార్తను పత్రికలు, చానళ్ళు ఇప్పటివరకు నిర్ధారించులేక పోయాయి? రెండ్రోజులుగా ఆ కథనానికి ఊపిరిపోసేలా సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు శాసనసభ సమావేశాలను పొడిగించాలని స్పీకర్‌కు లేఖలు ఇవ్వడం, వివరణలు కోరుతూ రాష్ట్రపతికి లేఖలు రాస్తే వాటిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రపతి కార్యాలయానికి పంపడం, ఈలోగా మరో నాలుగు వారాలు సమయం పొడిగించాలని ప్రజా ప్రతినిధులు రాష్ట్రపతికి నివేదనలు పంపడం చూస్తుంటే ఏమి అర్ధమవుతున్నది? అందరూ కలసి నాటకంలో తమ పాత్రలు ఎంత రసకందాయంగా పోషిస్తున్నారో తెలుస్తుంది కదూ!! ఇదే మీడియా మేనేజ్‌మెంట్!! సభ్యులందరూ తమ వాదనలు వినిపించాలట. ఒక్క ముఖ్య మంత్రే 10 గంటల చర్చకు సిద్ధమవుతున్నాయంటూ ఎన్నెన్ని కాకరకాయ వంటకాలో.. ఉత్కంఠలకు, ఉద్రిక్తతలకు దారితీసేలా ఎన్నెన్ని ప్రయత్నాలో!!

20-1-14
*ఉసెండీ అయినా. కొండపల్లి అయినా, కెజి సత్యమూర్తి అయినా... రేపు గణపతి అయినా?? ఇవాళ మన రాజకీయ నాయకులైనా..తాము మునిగింది గంగ..కాకుంటే మురికి మూసీ. ఫిరాయింపుదారులది.. ఫర్మానాలిచ్చే అధినేతలదీ ఇదేదారి. తమకు నచ్చినన్నాళ్ళూ మెచ్చుకుంటారు. కానప్పుడు సచ్చినోడా అంటారు. లోపలున్నన్నాళ్ళు దేవాలయం.. బయటికొస్తే స్మశానం. నాయకులకు అడుగులకు మడుగులొత్తీతే భక్త శిఖామణి. ముల్లులా గుచ్చితే శిఖండి...కాంగ్రెస్, టీడీపి, వైకాపా, టి్ఆర్ఎస్, భిజెపి... ఏదైనా అంతే! ఆ గోడల మధ్య యజమాని నిలువెత్తు దేవుడులా కనిపిస్తాడు. గోడదూకిరాగానే నియంతగా అనిపిస్తాడు...        
ఈ సిద్ధాంతం జర్నలిస్టులకూ బాగా వర్తిస్తుంది. తాము రాసిందే భగవద్గీత, వేదం. ప్రత్యర్ధిది బూతు పురాణం. తమది సంసారం-ఎదుటి వారిది వ్యభిచారం..  (నేను చెప్పింది ఇంగ్లీషు జర్నలిస్టుల గురించి కాదు.. తెలుగు ఎర్నలిస్టుల గురించి మాత్రమే!! ఇంగ్లీషు ఇంకా అంత ఎంగిలికాలేదు. ఇది నా భావన.--ఇక్కడ కూడా ఇంగ్లీషుందండి..)

*ఈ మధ్య, పద్య గద్యాల సేద్యంలో ఆముదపు వృక్షాలు ఆకసంలో తారలై విహరిస్తున్నాయి.. పాఠకులూ! శ్రోతలూ!! ఇంచుక తమాయించుకోండి!!!

*సబ్బం స్వరం మారింది.. పబ్బం గడిచింది. గర్వము సర్వము ఖర్వమయ్యింది. తోమిన కొద్దీ సబ్బు అరుగుతుంది. కంట్లో నురగపోతే మంటెక్కుతుంది అప్పుడు బయట పారేస్తాం..

19-1-14
*అందరు జర్నలిస్టుల జీవితాలు వడ్డించిన విస్తరి కావు. ముఖ్యమంత్రులు ఎదురొచ్చి కారు డోరు తెరచి సాదరంగా ఆహ్వానించిన పాతతరం జర్నలిస్టులు వృత్తిమీద అంకితభావంతో లక్షలకు విలువచేసే ఆస్తులమ్ముకుని,సంతానం చేతికందిరాక రెండు పూతల మెతుకులు దొరకక బిచ్చమెత్తుకోలేక కుళ్ళిపోతున్న జీవితాలు ఇంకా సాక్షీ భూతాలుగా నిలిచి ఉన్నాయి. పెదవులపై నవ్వు పులుముకుని ఎదలో అగ్నిపర్వతాలు దాచుకున్న వారెందరో!!  అందుకనే నేనంటా జర్నలిస్టులందరూ ఎర్నలిస్టులు కాదని. కొందరు కార్లలో విహరిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు."ముందు" చూపున్నవాళ్ళు.   జర్నలిస్టు  జీవిత పుస్తకంలో సువర్ణాక్షరాలున్న కాగితాలు కొన్ని మాత్రమే!! 

No comments:

Post a Comment